ఇరోస్ నేతృత్వంలో మాస్ | Actor Surya 3-D movie mass | Sakshi
Sakshi News home page

ఇరోస్ నేతృత్వంలో మాస్

Published Fri, Feb 20 2015 2:36 AM | Last Updated on Wed, Apr 3 2019 8:56 PM

ఇరోస్ నేతృత్వంలో మాస్ - Sakshi

ఇరోస్ నేతృత్వంలో మాస్

 సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మాస్‌కు ఇరోస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ భాగస్వామి అయ్యింది. నటుడు సూర్య తొలిసారిగా నటిస్తున్న 3డి చిత్రం మాస్. ఈయన ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకుడు. నయనతార, ప్రణీత కథా నాయికలు. స్టూడియో గ్రీన్ పతాకంపై యువ నిర్మాత కె ఇ జ్ఞానవేల్ రాజా తన స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్న భారీ చిత్రం మాస్. నిర్మాణ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఇరోస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థతో కలసి ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇరోస్ సంస్థ స్టూడియో గ్రీన్ సంస్థ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు.
 
 ఇరోస్ సంస్థ దక్షిణాది క్రియేటివ్ డెరైక్టర్ సౌందర్య ఎ.రజనీకాంత్ పేర్కొంటూ ఇంతకుముందు సూర్య నటించిన మాట్రాన్ చిత్రాన్ని తమ సంస్థ భాగస్వామిగా విడుదల చేసిందని తెలిపారు. అదే విధంగా ఈ మాస్ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థతో కలిసి విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇరోస్ సంస్థ దక్షిణాదిలో మరింత బలంగా ఎదగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రాన్ని జూన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement