జిల్లా మహాసభ విజయవంతం చేయండి | adivasi pardan seva sangam district meeting held on 27 | Sakshi
Sakshi News home page

జిల్లా మహాసభ విజయవంతం చేయండి

Published Sun, Feb 26 2017 9:10 PM | Last Updated on Tue, Sep 5 2017 4:41 AM

adivasi pardan seva sangam district meeting held on 27

ఆదిలాబాద్‌ రూరల్‌ : ఈ నెల 27న పాత ఉట్నూర్‌లోని స్టార్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివాసీ పర్‌ధాన్‌ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న జిల్లా మహా సభకు పర్‌ధాన్‌ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పర్‌ధాన్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పూసం ఆనంద్‌రావ్, కోవ సురేశ్‌ తెలిపారు.

శనివారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్న పర్‌ధాన్‌ సభలో సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కోశాధికారి మెస్రం నగేశ్వర్‌రావ్, ఉపాధ్యక్షుడు తులసీరాం, కార్యనిర్వాహక కార్యదర్శి కె. మహేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement