సాక్షి ప్రతినిధి, చెన్నై:శ్రీలంక తమిళుల దారుణ హత్యలకు డీఎంకేనే కారణమని ఎమ్మెల్యే వెట్రివేల్ ఆరోపణలు, డీఎంకే సభ్యుల నిరసన ధ్వనులతో అసెంబ్లీ అట్టుడికి పోయింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. శ్రీలంకలో జరిగిన దారుణ మారణకాండ, కుప్పలు కుప్పలుగా తమిళులు ప్రాణాలు కోల్పోవడానికి డీఎంకే కారణం కాదా అని వెట్రివేల్ నిలదీయడంతో విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంతలో మంత్రి పన్నీర్‌సెల్వం జోక్యం చేసుకుని వెట్రివేల్‌కు మాట్లాడే హక్కు ఉంది, ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. దీంతో వెట్రివేల్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ డీఎంకే అధ్యక్షులు కరుణానిధి శ్రీలంక తమిళులకు వ్యతిరేకంగా అనేక చర్యలకు పాల్పపడ్డారని ఆరోపించడంతో విపక్ష నేత స్టాలిన్ అభ్యంతరం పలుకుతూ వెట్రివేల్ ఆరోపణలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు.
ఆరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన జయలలిత విజయ పరంపర ఇలానే కొనసాగుతుందని, ప్రజల వల్లనే నేను, ప్రజల కోసమే నేను అనే నినాదాన్ని అమ్మ నిజం చేశారని వెట్రివేల్ అన్నారు. ఆమెను అధికారం నుంచి దించేందుకు కొందరు చేసిన కుటిల ప్రయత్నాలు ఫలించలేదని డీఎంకేను పరోక్షంగా విమర్శించారు. ముఖ్యమం త్రి అభ్యర్థులు మాయమైపోయారు, నమక్కు నా మే అంటూ ప్రజల్లోకి వె ళ్లిన మరో నేత నాటకాలు ఆడారని స్టాలిన్ పేరు ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించడంతో డీఎంకే సభ్యులు లేచి నిలబడి నిరసన తెలిపారు. అంతేగాక వెట్రివేల్ వైపు చేయి ఎత్తి హెచ్చరికలు చేశారు. దీంతో స్పీకర్ కలుగజేసుకుని సభ్యులంతా తనవైపు తిరిగే మాట్లాడాలని కోరారు. శ్రీ లంక తమిళుల అంశాన్ని ఇక వదిలిపెట్టి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలపై మాట్లాడాల్సిందిగా వెట్రివేల్‌ను స్పీకర్ కోరారు. అసెంబ్లీలో అనవసరమైన అంశాలను లేవనెత్తుతున్నారని డీఎంకే సభ్యులను స్పీకర్ మందలించారు.
జయలలితను ప్రశంసించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే:
మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి ముఖ్యమంత్రి జయలలితను ప్రశంసిం చారు. తమిళనాడు రాజకీయాల్లో తొలి సారిగా ఒక మిహ ళా ముఖ్యమంత్రి వరుసగా రెండోసారి ఎన్నికయ్యారని జయ ను పొగిడారు. ప్రజల ప్రేమా లేక ధన మా అనే పోరాటంలో తాను గెలిచానని డీఎం కే సభ్యుడు ఐ పెరియస్వామి వ్యా ఖ్యానించగా, రాష్ట్ర ప్రజలంతా మూకుమ్మడిగా జయలలితపై చూపిన ప్రేమ వల్లనే అధికారంలోకి వచ్చామని మంత్రి పన్నీర్‌సెల్వం ఆయనకు బదులిచ్చారు.
జయను ప్రశంసించిన విజయధరణి
మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి ముఖ్యమంత్రి జయలలితను ప్రశంసించారు. తమిళనాడు రాజకీయాల్లో తొలిసారిగా ఒక మిహ ళా ముఖ్యమంత్రి వరుసగా రెండోసారి ఎన్నికయ్యారని జయను పొగిడారు. 500 టాస్మాక్‌లు మూసివేస్తున్నట్లుగా అధికారంలోకి రాగా నే సీఎం తన తొలి సంతకంతో ఆదేశాలు జారీ చేయగా, ఈ 500 టాస్మాక్‌లలో తన నియోజకవర్గంలో కూడా ఒకటి ఉందని తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
వాగ్యుద్ధం
Published Wed, Jun 22 2016 3:07 AM | Last Updated on Thu, May 24 2018 12:08 PM
Advertisement
Advertisement