రేపు సెన్సార్‌కు ఎన్నైఅరిందాల్ | Ajith's 'Yennai Arindhaal' Set to Get Censor Certificate Soon, Rathnam Reveals | Sakshi
Sakshi News home page

రేపు సెన్సార్‌కు ఎన్నైఅరిందాల్

Published Tue, Jan 20 2015 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM

రేపు సెన్సార్‌కు ఎన్నైఅరిందాల్

రేపు సెన్సార్‌కు ఎన్నైఅరిందాల్

ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తు న్న భారీ చిత్రాల్లో ఎన్నై అరిందాల్ ఒకటి.  ఇంతకు ముందు అజిత్‌తో ఆరంభం వంటి సంచలన విజయం సాధించిన చిత్రాన్ని నిర్మించిన ఏఎం రత్నం తన శ్రీసాయి రాం పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న తాజా భారీ చిత్రం ఎన్నై అరిందాల్. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష, అనుష్క హీరోయిన్లుగా నటించారు. పార్వతీ నాయర్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో అరుణ్ విజయ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. హరీష్ జయరాజ్ అంది స్తున్న ఈ చిత్రంలో పాటలు సూపర్ హిట్ అయ్యా యి. ఇక సంక్రాంతికి ఈ చిత్రం విడుదల అవుతుం దని సర్వత్రా భావించారు. అయితే, నిర్మాణానంతర కార్యక్రమాల్లో జాప్యం నెలకొనడంతో చిత్రం విడుదల వాయిదా పడింది. తాజాగా, అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని ఎన్నై అరిందాల్ రేసు సెన్సార్‌కు వెళ్లనుంది. ఈనెల 29న తెరపైకి తీసుకురానున్నట్టు చిత్ర నిర్మాత ఏఎం రత్నం అధికారికంగా వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement