
'నగదు రద్దు విధ్వంసకర చర్య'
ముంబై : పెద్ద నోట్ల రద్దు విధ్వంసకర చర్య అని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోషియేషన్ మండిపడింది. ముంబైలో సోమవారం అసోషియేషన్ ఉపాధ్యక్షుడు డి.థామస్ ఫ్రాంకో మీడియాతో మాట్లాడుతూ...ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నోట్ల రద్దు కారణంగా గడిచిన 13 రోజుల్లో పని ఒత్తిడి కారణంగా 11 మంది బ్యాంక్ ఉద్యోగులు మరణించడంతో పాటు అనేక మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక వేత్తలు కాదన్నారు. నగదు రద్దు పర్యవసానాలకు ఉర్జిత్ పటేల్ బాధ్యత వహించాలని థామస్ ఫ్రాంకో అన్నారు.