సాక్షి, ముంబై: పలు కారణాలవల్ల పార్టీని వదిలి బయటకు వెళ్లిన పదాధికారులు, కార్యకర్తలను తిరిగి చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీని మరిం త బలోపేతం చేయడంతో భాగంగా మాజీ సీనియర్లను అక్కున చేర్చుకునేందుకు ఈ ప్రయోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల పార్టీ కొందరు నాయకులు, కార్యకర్తలపై చర్యలు తీసుకుంది.
కొందరు నాయకులు, కార్పొరేటర్లను పార్టీ నుంచి వెలివేశారు. అలకలు, విభేదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలన్నింటినీ మర్చిపోయి తిరిగి సొంత గూటిలోకి చేరుకోవాలంటూ బీజేపీ మాజీలకు సూచిస్తోంది. మాజీ కార్పొరేటర్ పరాగ్ అల్వాణి, మాజీ మహిళ కార్పొరేటర్ జయశ్రీ ఖరాత్, భాండుప్ బీజేపీ పదాధికారి బాబూ శింగరే తదితరులు పార్టీ ఇచ్చిన పిలుపునకు స్పందించారు.
వీరితోపాటు చర్యలు తీసుకున్న కార్యకర్తలనూ తిరిగి చేర్చుకుంటామని బీజేపీ ముంబై అధ్యక్షుడు, ఎమ్మెల్యే అశిష్ శేలార్ ప్రకటించారు. పరాగ్ అల్వాణి భార్య జ్యోతి అల్వాణి గత ఎన్నికల్లో విలేపార్లే నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీచేసి గెలిచారు. అయితే శేలార్ ఆహ్వానాన్ని ఆమె కూడా అంగీకరించి పార్టీలో చేరారు. ఇలా పార్టీ నుంచి దూరమైన అందరినీ తిరిగి చేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. బీజేపీకి చెందిన వారితోపాటు ఇతర పార్టీల కార్పొరేటర్లు, నాయకులను పెద్ద సంఖ్యలో పార్టీలో చేర్చుకునేందుకు వివిధ ప్రణాళికలు రూపొం దిస్తున్నామని శేలార్ చెప్పారు.
మాజీలకు మరోసారి ఆహ్వానం
Published Mon, Oct 7 2013 2:00 AM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement
Advertisement