అంబేద్కర్ బ్యాంక్ కోసం ధర్నా | Ambedkar Bank For the Darna | Sakshi
Sakshi News home page

అంబేద్కర్ బ్యాంక్ కోసం ధర్నా

Published Sun, Dec 15 2013 11:36 PM | Last Updated on Tue, Jun 4 2019 6:28 PM

Ambedkar Bank For the Darna

సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ మహిళా బ్యాంక్ తరహాలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ‘భారతీయ అంబేద్కర్ బ్యాంక్’ ఏర్పాటు చేయాలని కోరుతూ జంతర్‌మంతర్ వద్ద ఆదివారం ఉదయం భారతీయ అంబేద్కర్ సేన(బీఏఎస్) ఆంధ్రప్రదేశ్ సభ్యులు ధర్నా చేశారు. ఇప్పటిదాకా తమ డిమాండ్ నెరవేర్చనందుకు అరగుండు, అరమీసంతో వినూత్నంగా నిరసన వ్యక్తం  చేశారు.ఎస్సీ, ఎస్టీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి పథకాల్లో బ్యాంకులు 10 శాతం కూడా రుణాలను లబ్ధిదారులకు అందజేయడం లేదని బీఏఎస్ రాష్ట్ర కన్వీనర్ పీటీఎం శివప్రసాద్ అన్నారు.
 
 దీంతో బ్యాంక్ రుణాలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న వేల కోట్ల రూపాయల సబ్సిడీలు ఎస్సీ, ఎస్టీలకు చేర డం లేదన్నారు. కుల వివక్షతో బ్యాంకులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్తితి తలెత్తుతోందని ఆరోపించారు. దీంతో వారంతా ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటిని నిరోధించేందుకు భారతీయ అంబేద్కర్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నాలో రాయలసీమ జిల్లాలకు చెందిన పలువురు ఎస్సీ, ఎస్టీలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement