సచివాలయ ఉద్యోగులకు శుభవార్త
వెలగపూడి: ఏపీ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చిన సచివాలయ ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న వారానికి ఐదు రోజుల పనిదినాలను 2018 జూన్ వరకూ పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సచివాలయం, హెచ్‌వోడీ, కార్పొరేషన్ ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాలు వర్తిస్తాయి. ప్రభుత్వ నిర్ణయంతో అమరావతి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.