సత్ప్రవర్తన ఖైదీల విడుదలకు పచ్చజెండా !
నూతన మార్గదర్శకాలకు మంత్రి మండలి ఆమోదం
బెంగళూరు: మంచి నడవడిక కలిగిన ఖైదీల విడుదలకు హోంశాఖ రూపొందించిన నూతన మార్గదర్శకాల అమలుకు ముఖ్యమంత్రిసిద్ధరామయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రి మండలి పచ్చ జెండా ఊపింది. ఇందుకు సంబంధించిన వివరాలను న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర మీడియాకు వివరించారు.
→క్రిమినల్ ప్రొసీజర్స్ కోడ్ (సీఆర్‌పీసీ) సెక్షన్ 433ఏ కింద యావజ్జీవ కారాగార శిక్ష పడిన మహిళ, పురుష ఖైదీలు ఖచ్చితంగా 14 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసి ఉండాలి.
→సీఆర్‌పీసీ సెక్షన్ 433 ఏ కింద యావజ్జీవ కాగాగార శిక్ష పడిన పురుష ఖైదీలు 4 నాలుగేళ్ల రెమిషన్‌తో పాటు ఖచ్చితంగా 10 ఏళ్ల సాధారణ జైలు (4+10 ఏళ్లు) శిక్షను పూర్తి చేసి ఉండాలి.
→433ఏ కానీ, మిగిలిన సెక్షన్ల కింద యావజ్జీవ కారాగార శిక్ష పడిన మహిళ ఖైదీలు మూడేళ్ల రెమిషన్‌తో పాటు ఖచ్చితంగా ఏడేళ్ల సాధారణ జైలు (3+7 ఏళ్లు) జీవితాన్ని పూర్తి చేసి ఉండాలి.
→65 ఏళ్లు పైబడిన పురుష ఖైదీలు రెమిషన్‌తో పాటు 14 ఏళ్ల సాధారణ జైలు జీవితాన్ని పూర్తి చేసి ఉండాలి
→60 ఏళ్ల పైబడిన మహిళా ఖైదీలు రెమిషన్‌తో కలుపసుకుని 12 ఏళ్ల సాధారణ జైలు జీవితాన్ని పూర్తి చేసి ఉండాలి
మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు...
→ రేషన్‌షాపు నిర్వాహకులకు కమీషన్‌ను క్వింటాల్‌కు రూ.70 పెంచుతూ నిర్ణయం. గతంలో ఇది రూ.56గా ఉండేది. అదే విధంగా కమిషన్ రూపంలో రెండు గోనెసంచుల సంఖ్యలో ఎటువంటి మార్పు లేదు.
→ చంద్రగిరి చక్కెర కర్మాగారం పరిధిలోకి బెళగావి జిల్లా రామదుర్గ తాలూకా పరిధిలోని 14 పల్లెలను చేర్చడానికి అంగీకారం.
→ మైసూరులో రూ.70 కోట్ల నిధులతో 50 పడకల ఆసుపత్రి రూపకల్పనకు మంత్రి మండలి పచ్చజెండా
→ బంగారుపేట-మారికుప్ప మధ్య రూ.24.79 కోట్ల నిధులతో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతి
ఖైదీల విడుదలకు పచ్చజెండా !
Published Thu, Jul 21 2016 1:53 AM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
Advertisement