Virtue
-
ఏది ధర్మం? ఏది అధర్మం?
పంచ మహాయజ్ఞాలలో మొదటిది అధ్యాపనం అంటే ఒకరికి చెప్పడం. మరొకరికి చె΄్పాలంటే ముందు మనం చదవాలిగదా! దేనికోసం... కర్తవ్యమ్. అదేమిటో ముందు మనం తెలుసుకోవాలి. అంటే కర్తవ్యమే ధర్మం. ధర్మం ఎప్పుడూ ఒక్కలాగా ఉండదు. నిరంతరం మారి΄ోతుంటుంది. ఎప్పుడు ఏ ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో చెప్పవలసివస్తే... చెప్పేవారు.. ఎవరి మనోభావాలనుబట్టి వారు చెవుతుంటారు. నాకేది ఇష్టమో నేనదే ధర్మమని చెబుతా. ఇంకొకాయన ఆయనకు నచ్చినది ధర్మమని చెబుతాడు. అప్పుడు నిజానికి ఏది ధర్మం?ధర్మం చెప్పడానికి ఒక ప్రమాణం ఉండాలి. అది ఏది అంటే ... యోగమే. యోగం ఎవరు ? భగవంతుడే. నాకూ నా ఊపిరికీ తేడా లేదు. నేను ఊపిరి తీసి విడిచిపెడుతున్నంతకాలం ‘నేను’ ఉన్నాను–అంటారు. నా ఊపిరే నా వాక్కుగా మారుతున్నది. అలాగే భగవంతుని ఊపిరి వాక్కుగా మారితే అదే వేదం. అందుకే భగవంతుడికీ, వేదానికీ వ్యత్యాసం ఉండదు. వేదం ఎంత సనాతనమో భగవంతుడంత సనాతనం. భగవంతుడిని ఎవరూ సృష్టించలేదు. ఆయనే అన్నీ సృష్టించాడు. వేదం కూడా అంతే.. అ΄ûరుషేయం. దానిని ఎవరూ రాయలేదు. అందుకే వేదం, ఈశ్వరుడూ ఒకే స్వభావంతో ఉంటారు. కారణం – నిజానికి అవి రెండు కాదు కాబట్టి. అటువంటి వేదం ధర్మం చెప్పడానికి మొదటి ప్రమాణం.నేను వేదం చదువుకోలేదని ఎవరయినా అంటే!!! వేదాంతర్గతమైన ఆచార సంబంధ నియమాలను రుషులు క్రోడీకరించి ఇచ్చారు. గౌతముడిస్తే అది గౌతమ స్మృతి అయింది. అత్రి ఇస్తే అత్రి స్మృతి, యాజ్ఞవల్క్యుడిస్తే యాజ్ఞవల్క్య స్మృతి.. అలా ఈ స్మృతి గ్రంథాలు ప్రమాణం. ఆవువెంట దూడ ఎలా వెడుతుందో శ్రుతి వెంట స్మృతి అలా వెడుతుంది..అంటాడు కాళిదాసు. కాబట్టి శ్రుతి తరువాత స్మృతి ప్రమాణం.స్మృతిగ్రంథాలు కూడా తెలియవని అంటే...!!! పురాణం ప్రమాణం. పురాణం జరిగి΄ోయిన చరిత్ర కాదు. కల్పింపబడిన కథ కూడా కాదు. జాగ్రత్తగా పరిశీలించండి... కల్పనయితే అందులో రచయిత వేరు, కథావస్తువు వేరుగా ఉంటుంది. అందువల్ల ఇది కల్పన కాదు. పురాణాలను ఇతిహాసములు–అంటారు. ఇతిహాసం... అంటే ‘‘ఇది ఇట్లే జరిగినది. అందులో అనుమానం లేదు’’... అని.రామాయణంలో వాల్మీకి మహర్షి అంతర్భాగం. ఆయనది పాత్రకాదు. అందులో ఒక వ్యక్తి. అలాగే భారతంలో, భాగవతంలో వ్యాసుడు అంతర్భాగం. అంతేకానీ వ్యాసుడు వేరు, భారత భాగవతాదులు వేరు కావు. అది వాళ్ళ కాలంలో యధార్థంగా జరిగిన విషయాలను వాళ్ళు రచించి మనకిచ్చారు. అవి జీవుడి ప్రస్థానాన్ని పూర్తిగా చెబుతాయి. అందుకే పురాణాలు చదివితే ఒక స్పష్టత ఏర్పడుతుంది. అందువల్ల పురాణం ప్రమాణం.నాల్గవది. శిష్టాచారం. యద్య దాచరతి శ్రేష్ఠ స్తత్త దేవేతరోజనః / స యత్ప్రమాణం కురుతే లోక స్తదనువర్తతే’’ అంటాడు గీతాచార్యుడు. శ్రేష్టులయినవారు, శాస్త్రమెరిగినవారు... లోకంలో ఎలా ప్రవర్తిస్తారో దాన్ని మిగిలినవారంతా అలా అనుకరిస్తారు’’ అని. ధర్మం చెప్పడానికి, అనుసరించడానికి ఈ నాలుగు మార్గాలు ్రపామాణికం. -
దానం ధర్మం
దానధర్మాలు ద్వంద్వ సమాసం. జంటగా కనపడతాయి. రెండూ ఒకటే అనుకుంటారు. ధర్మంలో దానం కూడా భాగం. దానం అంటే తన కున్నదానిని ఇతరులకు ఇవ్వటం. ‘ద’ అంటే ఇవ్వటం. ఆ ప్రక్రియ దానం. దానం, ధర్మం అనే రెండింటిని సమానార్థకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. అడుక్కునేవాడు ‘‘అయ్యా! ధర్మం చేయండి.’’ అంటాడు. తనకున్న దానిని లేనివాడికి పంచటం ధర్మాచరణలో భాగం అని అర్థం చేసుకోవాలి. ‘‘నీ కిదేమైనా ధర్మంగా ఉందా?’’ అని అడిగి నప్పుడు ధర్మం అంటే న్యాయం అని అర్థం చేసుకోవాలి. రసాయన శాస్త్రంలో ఉదజని ధర్మాలు అని అంటే దాని సహజగుణాలు అని అర్థం. ‘‘సూర్యుడు తూర్పున ఉదయించును’’ అన్నది ఏ కాలం అని వ్యాకరణంలో అడిగినప్పుడు తద్ధర్మ కాలం అని సమాధానం వస్తుంది. ఇక్కడ కర్తవ్యం, విధి, తప్పక చేయవలసినది అనే అర్థం. తన దగ్గర ఉన్న దానిని ఇతరులతో పంచుకోవటం ధర్మంలో భాగం కనుక దానానికి పర్యాయ పదంగా ధర్మం అని అనటం జరుగుతోంది. దానం ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలో పెద్దలు మనకి చెప్పారు. ‘‘శ్రియా దేయం హ్రియా దేయం, సంవిదా దేయం’’ అని. తనదగ్గర ఉన్న సంపదకి తగినట్టుగా ఇవ్వాలట. ఒక కోటీశ్వరుడు ఒక రూపాయి దానం చేస్తే ఎంత సిగ్గుచేటు? వంద సంపాదించే రోజుకూలీ రూపాయి ఇస్తే పరవాలేదు కాని యాభై ఇస్తే తన తాహతుకి మించింది. తరవాత కష్టపడతాడు. సిగ్గుపడుతూ ఇవ్వాలట. ఇంతకన్న ఇవ్వలేక పోతున్నాను అని. తానే సిగ్గు పడుతూ ఉంటే తీసుకున్నవారు ఇంకెంత సిగ్గుపడాలో! తెలిసి ఇవ్వాలట. ‘‘గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణం’’ అన్నట్టు కాకుండా మన చేతిలో నుండి జారిపోయింది దానం అనుకో కూడదు. ఇస్తున్నాను అని ఎరిగి ఇవ్వాలట. ఎవరికి ఇచ్చేది కూడా తెలిసి ఉండాలి. అంతా అయినాక వీళ్ళకా నేను ఇచ్చింది అని, ఇంత ఎందుకు ఇచ్చాను అని బాధపడకూడదు. దానాలు చాలా కారణాలుగా, చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. గ్రహదోషాలు ఉన్నాయి అంటే జపాలు తాము చేయలేరు కనుక ఎవరి చేతనైనా చేయిస్తారు. ఆ గ్రహానికి సంబంధించి కొన్ని వస్తువులు, ధనం దానం చేస్తారు. ఇది ప్రతిఫలాపేక్షతో చేసేది. ఒక రకమైన వ్యాపారం అని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కొంతమంది ఆడంబరం కోసం దానాలు చేస్తూ ఉంటారు. తాము చేసిన దానిని ప్రకటించటం, ప్రచారం చేసుకోవటం, ఫోటోలు తీయించుకుని వార్తాపత్రికలలో వేయించుకుంటూ ఉండటం చూస్తాం. తీసుకున్న వారిని చులకనగా చూస్తూ తమకు కృతజ్ఞులై ఉండాలని ఆశించటం కనపడుతుంది. కొద్దిమంది ఎదుటి వారి అవసరం ఎరిగి అడగకుండానే దానం చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎటువంటి ప్రతిఫలాపేక్ష ఉండదు. పైగా ఎవరికీ చెప్పనీయరు. కుడిచేత్తో చేసినది ఎడమ చేతికి తెలియ కూడదట. ఎందుకు దానం చేశావు అంటే నా దగ్గర ఉన్నది, వాళ్ళ దగ్గర లేదు... అంటారు. తీసుకున్నవారు సంతోషించినప్పుడు ఆ భావతరంగాలు ఇచ్చిన వారిని స్పృశిస్తాయి. వీరిని ఆవరించి ఉన్న ప్రతికూల తరంగాలు తప్పుకుంటాయి. ఇవ్వటానికి మా దగ్గర ఏముంది? అని సన్నాయి నొక్కులు నొక్కుతారు కొందరు. తథాస్తు దేవతలుంటారు. తస్మాత్ జాగ్రత్త! ఏమీ లేక పోవుట ఏమి? ధనం మాత్రమేనా ఇవ్వదగినది? జ్ఞానం, శరీరం, ఆలోచన, మాట .. ఇట్లా ఎన్నో! తన జ్ఞానాన్ని పంచవచ్చు. జ్ఞానం లేకపోతే శరీరంతో సేవ చేసి సహాయ పడవచ్చు. అదీ చేత కాకపోతే మాట సహాయం చేసి సేద తీర్చవచ్చు. ఇది ధర్మమే కదా! ఈ ధర్మాన్ని పరిరక్షించుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. భారతీయ సంస్కృతిలో ధర్మానికి పెద్ద పీట వేశారు. ధర్మమే మనలను ఎల్లప్పుడు కాపాడుతుంది. మనం చాలా శతాబ్దాలు విదేశీయుల పాలనలో మగ్గిపోయాము. కాని ముష్కరులు మన ధర్మం మీద దెబ్బతీయలేక పోయారు. ధర్మగ్లాని దశలో మనం ఉన్నప్పుడు సాధుసంతులు, మహాత్ములు ఉక్కుగోడలా నిల్చొని ధర్మాన్ని కాపాడారు. అదే సమయంలో కొన్ని దేశాలు, సంస్కృతులు విదేశీయుల ఆక్రమణల కారణంగా నామరూపాలు లేకుండా పోయాయి. మనకు ఇతరులు ఏమి చేయకూడదనుకుంటామో అది ఇతరులకు మనం చేయకపోవడం సర్వోత్తమ ధర్మం. మన ప్రాచీన ద్రష్టలైన మునులు లోక కళ్యాణం కొరకు నిర్వచించిన ధర్మం, దాని ఆచరణ మనకు వారసత్వంగా ఒక తరం నుంచి ముందు తరానికి వస్తూ మన తరం వరకు వచ్చింది. అంటే ధర్మచక్రం ఏ తరంలోనూ ఆగిపోలేదు. ఈ తరంలో ఆగిపోతే తరువాత తరం వారు ధర్మ భ్రష్టులవుతారు. ధర్మచక్రం ఆగిపోతే ఈ జాతి మనుగడ ఉండదు. – డా. ఎన్.అనంతలక్ష్మి -
గురువాణి – 3: ఆ.. నలుగురి కోసం కూడా...
వ్యక్తి ఒక్కడుగా చేయవలసిన త్యాగం ఉంటుంది. ఒక్కడుగా పదిమందికి చేయవలసిన ఉపకారం ఉంటుంది. పదిమందీ కలిసి వ్యవస్థకు చేయవలసిన ఉపకారం ఉంటుంది. తను ఉంటున్న ఇంటిలోని బావిలో మంచినీటి ఊట ఉంది. చుట్టుపక్కల ఎవరి బావిలోనూ లేదు. తాను పట్టుకోవడంతోపాటూ ఇరుగుపొరుగుకూ మంచినీటిని పట్టుకోవడానికి అనుమతించగలగాలి. ఒక ధనవంతుడున్నాడు. ఊరిలో మంచి నీటి ఎద్దడి ఉంది. పదిమందికి పనికొచ్చేలో అందరికీ అందుబాటులో ఒక బావి, ఒక చెరువు తన తాహతుకు తగ్గట్టు తవ్వించగలగాలి. ఒక గుడి కట్టించగలగాలి. గుడి తానొక్కడే కట్టించినది కావచ్చు. కానీ దేవుడి బట్టలు ఉతకడానికి ఒక వ్యక్తి కావాలి. పల్లకి పట్టుకోవడానికి పదిమంది కావాలి. మంగళవాయిద్యాలు మోగించడానికి ఓ నలుగురు కావాలి. వేదం వచ్చినాయన వేదం చదువుతాడు. నాట్యం వచ్చినామె నాట్యం చేస్తుంది. పాటపాడగలిగినవాడు మంచి కీర్తనలు పాడతాడు. గుడిని శుభ్రపరిచేవాళ్ళు శుభ్రపరచాలి. కాగడా పట్టుకోగలిగిన వాడు అది పట్టుకుంటాడు. ఎవరికి ఏది చేయగలిగిన శక్తి ఉంటే గుడి ద్వారా సమాజానికి చేస్తారు. పదిమంది కలిసి ద్రవ్యం కానుకగా ఇస్తారు. భగవంతుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని అరమరికలు లేకుండా అందరికీ పెట్టి పంపిస్తారు. అందరూ కలిసి అందరికీ ఉపయోగపడడం అంటే ఇదే. ఇది నేర్పడానికే మనకు దేవాలయ వ్యవస్థ వచ్చింది. అందరూ కలిసి విడివిడిగా ఒక వ్యవస్థ ద్వారా అందరికీ సేవ చేస్తున్నారు. నువ్వు పట్టుకుపోయేదేమీ లేదు. ఇక్కడ నువ్వు ఏది చేసావో అది పుణ్యంగా మారుతోంది. నిజానికి నువ్వే అభ్యున్నతిని పొందుతున్నట్టు. నాకు సంగీతం వచ్చు. నేనెంతో కష్టపడి నేర్చుకున్నా. ప్రతిఫలం లేకుండా నేనిది అందరికీ ఎందుకు నేర్పాలి... అని నేను ఆలోచించాననుకోండి. విద్య ఏమయిపోతుంది ? చిన్నగుంటలో నిలిచిన నీళ్ళు కొద్దిరోజులకు ఆవిరయిపోయి ఎండిపోయినట్లు అది ఎవరికీ పనికి రాదు. కానీ నిస్వార్థంగా సంతోషంగా నలుగురికీ పంచిపెట్టేదేదో అది పుణ్యంగా మారిపోతుంది. పదిమందికి అన్నం పెట్టవచ్చు. పేదవారికోసం ఓ కళ్యాణ మంటపం కట్టి ఉచితంగానో తక్కువ డబ్బుకో దానిని ఇవ్వవచ్చు. ఇక్కడ ఉండి శరీరం వదిలిన తరువాత నీ శరీరం ఇక్కడే ఉండిపోతుంది. కానీ ఒకరికి పెట్టిందేదో అది పుణ్యంగా మారి నీతో వస్తుంది. నువ్వు అనుభవించక, ఒకరికి పెట్టక, నువ్వు సాధించేముంది? ‘‘లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారంబు మింగబోడు...’’ ఎంత డబ్బుంటే మాత్రం ఆకలేసినప్పుడు బంగారంతో పొట్టనింపుకోలేవు గదా... అందరిలాగే ఉప్పు, పప్పుతోనే నింపుకోవాలి. అందుకే స్వార్థం మానుకొని నలుగురిని గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి. మీరు సంపాదించిన దానిలో శాస్త్రం అంగీకరించిన మేర అంత దాచుకోండి. ఎంత అనుభవించాలో అంత అనుభవించండి. ఉండీ దరిద్రంగా బతకమని ఏ శాస్త్రమూ చెప్పలేదు. జీవుడికి పునర్జన్మ ఉందని జ్ఞాపకం పెట్టుకొని పదిమందిని ఆదుకోండి. లేకపోతే జన్మకు అర్థం లేదు. వేమనగారు చెబుతున్నది కూడా అదే... ‘‘ధనము కూడబెట్టి దానంబు చేయక/తాను దినక లెస్స దాచుకొనగ/ తేనెటీగ గూర్చి తెరువరికియ్యదా/ విశ్వదాభిరామ వినుర వేమ.... ’’ దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వర రావు పంతులుగారు అమృతాంజన్ వ్యాపారం పెట్టి... చాలా సంపాదించారు. అంతా తానే ఉంచేసుకోలేదు. కుటుంబం కోసమే దాచిపోలేదు. ఎన్నెన్ని దానధర్మాలు చేసారో, స్వాతంత్య్ర సంగ్రామం కోసం ఎంతెంత ఖర్చు చేసారో, ఎంతెంత మంది పేదవారికి ఉపాధి కల్పించారో తెలిస్తే ఆశ్చర్యపోతాం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
వారి గుండెల్లో బాంబులాంటి వార్తను పేల్చారు..
సాక్షి ప్రతినిది, చెన్నై: నాలుగేళ్ల శిక్షాకాలం ముగిసేలోపే విడుదలవ్వాలని శశికళ పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. సత్ప్రవర్తన పరిధిలో ఆమె లేనందున ముందస్తు విడుదల సాధ్యం కాదని, శిక్షాకాలాన్ని పూర్తిగా అనుభవించాల్సి ఉంటుందని కర్ణాటక జైళ్లశాఖ డైరక్టర్ ఎన్ఎస్ మెక్రిక్ సోమవారం స్పష్టం చేశారు.అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2017 ఫిబ్రవరి నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో నాలుగేళ్ల శిక్షను అనుభవిస్తున్నారు. ఇదే కేసులో ఆమె సమీప బంధువులు ఇళవరసి, సుధాకర్ కూడా అదే జైల్లో నాలుగేళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్నారు. వీరి శిక్షాకాలం ప్రారంభం కాగా ప్రస్తుతానికి రెండున్నరేళ్లు పూర్తయిన దశలో సత్ప్రవర్తన కింద ముందుగానే జైలు నుంచి విడుదల అవుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. శశికళ, ఆమె అక్క కుమారుడు టీటీవీ దినకరన్ సైతం విడుదల కోసం ఎదురుచూశారు.ఈ స్థితిలో కర్ణాటక జైళ్లశాఖ డైరక్టర్ ఎన్ఎస్ మెక్రిక్ వారి గుండెల్లో బాంబులాంటి వార్తను పేల్చారు. శశికళ తన శిక్షాకాలాన్ని పూర్తి చేసిన తరువాతనే విడుదల అవుతారని, జైలులో సత్ప్రవర్తన కింద ఆమెను పరిగణించలేమని తేల్చేశారు. ఈ సమాచారంతో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం శ్రేణులు దిగాలులో పడిపోయారు. పూర్తిస్థాయి శిక్షాకాలం అంటే 2021 ఫిబ్రవరి వరకు శశికళ విడుదల కోసం వేచి ఉండక తప్పదని వాపోతున్నారు. -
ధర్మం కాపాడుతుంది..!
ఇస్లాం వెలుగు పూర్వం కొంతమంది మిత్రులు కలిసి ఒక దూరదేశానికి ప్రయాణం కట్టారు. అలా వెళుతూ వెళుతూ ఒక దట్టమైన అడవిలో ప్రవేశించారు. అడవిగుండానే ప్రయాణం. కొంతదూరం వెళ్ళిన తరువాత వారు దారి తప్పారు. కొన్నిరోజులపాటు ప్రయాణించినా వారికి సరైన మార్గం దొరకలేదు. అడవిలో తిరిగీ తిరిగీ బాగా అలసిపొయ్యారు. వెంట తెచ్చుకున్న తినుబండారాలు కూడా నిండుకున్నాయి. ఈ క్రమంలో వారికి ఒక ఏనుగు పిల్ల కనిపించింది. వారు దాన్ని పట్టుకున్నారు. ప్రయాణ బృందానికి నాయకుడుగా ఉన్న అబ్దుల్లాహ్, ఆ పిల్ల ఏనుగును వదిలేయమన్నారు సహచరులతో.. కాని వారు, చాలారోజులనుండి సరైన ఆహారం లేక ఆకలితో చచ్చిపోతున్నాం కనుక దీన్ని కోసుకొని తిని ఆకలి తీర్చుకుందామన్నారు. ఏనుగుమాంసాన్ని తినడం ధర్మ సమ్మతం కాదని, ఆకలితో ప్రాణం పోయే పరిస్థితులు ఏర్పడితే అప్పుడు ఆలోచించవచ్చు గాని, ఇంకా అలాంటి గడ్డుస్థితి రాలేదు కాబట్టి దైవనియమావళిని ఉల్లంఘించవద్దని వారించాడు అబ్దుల్లా. కాని సహచరులు అబ్దుల్లా మాట వినకుండా దాన్ని కోసి వండుకొని తిన్నారు. అబ్దుల్లాను కూడా తినమని బలవంతం చేశారు. కాని అతను దాన్ని ముట్టలేదు. పైగా సహచరులు చేసిన పనికి చాలా బాధపడ్డాడు. చాలారోజుల తరువాత కడుపునిండా తిన్న సహచరులు అక్కడే ఒకచోట నిద్రకు ఉపక్రమించారు. తోటివాళ్ళంతా సుష్టుగా తిని గుర్రుపెట్టి నిద్రపోతుంటే, ఆకలి బాధతో అబ్దుల్లాకు నిద్రపట్టడం లేదు. అటూ ఇటూ దొర్లుతున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి సమయాన భూమి కదులుతున్నట్లు అనిపించసాగింది. ఆకలితో నిద్రపట్టక దొర్లుతున్న అబ్దుల్లాకు భూకంపం వస్తుందేమోనన్న అనుమానం కలిగింది. తీరా చూస్తే అది భూప్రకంపన కాదు. ఏనుగుల గుంపు... వారిని సమీపిస్తోంది. ఒక్కొక్కడి నోటిదగ్గర తొండాలతో వాసన చూస్తూ చీమల్ని నలిపినట్లు నలిపిపారేస్తున్నాయి. కొంతమంది మేల్కొని పారిపోడానికి ప్రయత్నించారు. కాని ఏనుగులు వారికి ఆ అవకాశమే ఇవ్వలేదు..! అంతలో ఒక ఏనుగు అబ్దుల్లాను సమీపించింది. గట్టిగా కళ్ళు మూసుకొని దైవాన్ని తలచుకున్నాడు అబ్దుల్లా. కాని ఏనుగు తన తొండంతో అబ్దుల్లాను వాసన చూసి వెనక్కి వెళ్ళిపోయింది. బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకునేంతలోనే మరో పెద్దఏనుగుతో కలిసి అతణ్ణి సమీపించింది. అది కూడా అబ్డుల్లాను వాసన చూసింది. కాని ఏమీ చేయలేదు. ఇంతలో అందరి పని పూర్తిచేసిన మిగతా ఏనుగులు కూడా అక్కడ గుమిగూడాయి. అన్నీ తమ తమ తొండాలను రాసుకొని ఏమో గుసగుసలాడాయి. పెద్దఏనుగు తన తొండంతో అబ్దుల్లాను ప్రేమతో నిమిరి, ఎంతో అపురూపంగా తొండంతో ఎత్తి వీపుపై కూర్చోబెట్టుకుంది. మిగతా గుంపంతా జయజయ ఘీంకారం చేస్తుండగా నాయక ఏనుగు అబ్దుల్లాను తీసుకొని ఊరి పొలిమేరల వద్దకు చేర్చింది. మరొక్కసారి ఏనుగులన్నీ నిశ్శబ్దంగా తమ తొండాలను పైకెత్తి అబ్దుల్లాకు అభివాదం చేసి అడవిలో అదృశ్యమైపొయ్యాయి. కొంతదూరం నడిచి ఊళ్ళోకి చేరుకున్న అబ్దుల్లా, ధర్మాధర్మ విచక్షణను విడిచిపెట్టి, దైవ నియమావళిని ఉల్లంఘిస్తే సంభవించే దుష్పరిణామాలను ఊరివారికి సోదాహరణంగా వివరించాడు. ధర్మావలంబనలో ఉన్న మేలునూ, సాఫల్యాన్నీ విశదీకరించాడు. కనుక కట్టుబాట్లను విస్మరిస్తే... ధర్మాన్ని ఉల్లంఘిస్తే ఇహ పర వైఫల్యాలు తప్పవని గ్రహించాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఖైదీల విడుదలకు పచ్చజెండా !
సత్ప్రవర్తన ఖైదీల విడుదలకు పచ్చజెండా ! నూతన మార్గదర్శకాలకు మంత్రి మండలి ఆమోదం బెంగళూరు: మంచి నడవడిక కలిగిన ఖైదీల విడుదలకు హోంశాఖ రూపొందించిన నూతన మార్గదర్శకాల అమలుకు ముఖ్యమంత్రిసిద్ధరామయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రి మండలి పచ్చ జెండా ఊపింది. ఇందుకు సంబంధించిన వివరాలను న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర మీడియాకు వివరించారు. →క్రిమినల్ ప్రొసీజర్స్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 433ఏ కింద యావజ్జీవ కారాగార శిక్ష పడిన మహిళ, పురుష ఖైదీలు ఖచ్చితంగా 14 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసి ఉండాలి. →సీఆర్పీసీ సెక్షన్ 433 ఏ కింద యావజ్జీవ కాగాగార శిక్ష పడిన పురుష ఖైదీలు 4 నాలుగేళ్ల రెమిషన్‌తో పాటు ఖచ్చితంగా 10 ఏళ్ల సాధారణ జైలు (4+10 ఏళ్లు) శిక్షను పూర్తి చేసి ఉండాలి. →433ఏ కానీ, మిగిలిన సెక్షన్ల కింద యావజ్జీవ కారాగార శిక్ష పడిన మహిళ ఖైదీలు మూడేళ్ల రెమిషన్‌తో పాటు ఖచ్చితంగా ఏడేళ్ల సాధారణ జైలు (3+7 ఏళ్లు) జీవితాన్ని పూర్తి చేసి ఉండాలి. →65 ఏళ్లు పైబడిన పురుష ఖైదీలు రెమిషన్‌తో పాటు 14 ఏళ్ల సాధారణ జైలు జీవితాన్ని పూర్తి చేసి ఉండాలి →60 ఏళ్ల పైబడిన మహిళా ఖైదీలు రెమిషన్‌తో కలుపసుకుని 12 ఏళ్ల సాధారణ జైలు జీవితాన్ని పూర్తి చేసి ఉండాలి మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు... → రేషన్‌షాపు నిర్వాహకులకు కమీషన్‌ను క్వింటాల్‌కు రూ.70 పెంచుతూ నిర్ణయం. గతంలో ఇది రూ.56గా ఉండేది. అదే విధంగా కమిషన్ రూపంలో రెండు గోనెసంచుల సంఖ్యలో ఎటువంటి మార్పు లేదు. → చంద్రగిరి చక్కెర కర్మాగారం పరిధిలోకి బెళగావి జిల్లా రామదుర్గ తాలూకా పరిధిలోని 14 పల్లెలను చేర్చడానికి అంగీకారం. → మైసూరులో రూ.70 కోట్ల నిధులతో 50 పడకల ఆసుపత్రి రూపకల్పనకు మంత్రి మండలి పచ్చజెండా → బంగారుపేట-మారికుప్ప మధ్య రూ.24.79 కోట్ల నిధులతో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతి -
ఐదుగురు ఖైదీలు విడుదల
♦ ఇందులో ముగ్గురు జీవిత ఖైదీలు ♦ సత్ప్రవర్తన కారణంగా శిక్ష నుంచి విముక్తి జిల్లా కారాగారం నుంచి మంగళవారం ఐదుగురు ఖైదీలను సత్ప్రవర్తన కారణంగా విడుదల చేశారు. వీరిలో ముగ్గురు జీవిత ఖైదీలు కాగా, ఇద్దరు ఏడాదిన్నర శిక్ష పడిన వారు ఉన్నారు. - సంగారెడ్డి రూరల్ సంగారెడ్డి రూరల్: సత్ప్రవర్తన కారణంగా జిల్లా జైలు నుంచి మంగళవారం ఐదుగురు ఖైదీలు విడుదలయ్యారు. సత్ప్రవర్తన కారణంగా శిక్షా కాలానికి ముందే ప్రభుత్వం వీరిని విడుదల చేసింది. ఇందులో ముగ్గురు జీవిత ఖైదీలుండగా మరో ఇద్దరు ఏడాదిన్నర కాలం శిక్ష అనుభవించాల్సిన వారు ఉన్నారు. విడుదలైన వారిలో సంగారెడ్డి మండలం ఫసల్‌వాదికి చెందిన సి.మల్లప్ప 2006లో భార్యను హత్య చేసిన ఘటనలో శిక్షను అనుభవిస్తున్నాడు. తూప్రాన్‌కు చెందిన కె.భాస్కర్ ఆస్తి కోసం 2001లో తన తల్లిదండ్రులను హత్యచేయగా జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. న్యాల్కల్ మండలం తాటిపల్లికి చెందిన చాకలి నాగేష్ 2007లో తన భార్యను హత్య చేసిన నేరంపై జైలు పాలయ్యాడు. పటాన్‌చెరుకు చెందిన డి.రమేశ్, పటాన్చెరు మండలం క్యాసారం గ్రామానికి చెందిన మురళి... ఇతరుల ఆస్తులను ధ్వంసం చేసిన నేరంపై 2015 సెప్టెంబర్ నుంచి శిక్ష ను అనుభవిస్తున్నారు. పద్దెనిమిది నెలల శిక్షకు గాను సత్ప్రవర్తన కారణంగా వీరిని విడుదల చేసినట్టు జైలు సూపరింటెండెంట్ సంతోష్‌కుమార్‌రాయ్, జైలర్ చిరంజీవి తెలిపారు. -
ఖైదీల కుటుంబాలకు శుభవార్త
సత్ప్రవర్తన గల 252 మంది విడుదలకు కేబినెట్ ఆమోదం హైదరాబాద్: జైళ్లలో సత్ప్రవర్తన గల ఖైదీల విడుదలకు రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. జీవిత ఖైదుతోపాటు వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న దాదాపు 252 మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల పోలీసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలోని కమిటీ.. విడుదలకు అర్హులైన ఖైదీల జాబితాను సిద్ధం చేసింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది. ఇది ఇప్పటికే ఆలస్యమైనందున వెంటనే అమలు చేయాలని కేబినెట్లో నిర్ణయించారు. అలాగే ఇంటింటికీ తాగునీరు అందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి వివిధ రుణ సంస్థల నుంచి రూ.15 వేల కోట్ల రుణ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు కూడా పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగానే నాబార్డు నుంచి రూ.1,900 కోట్ల రుణానికి పూచీకత్తు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ముంబై పురపాలక విధానంపై అధ్యయనం చేయాలని, దీన్ని రాష్ట్రంలోనూ అమలు చేసే అంశంపై కేబినెట్లో చర్చ జరిగింది. సెప్టెంబర్ నాటికి ఈ-మార్కెట్లు కే ంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 214 వ్యవసాయ మార్కెట్లకు ఆన్లై న్ లింకింగ్‌తో (ఇ- మార్కెట్లు)గా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకుంది. అందులో 44 మార్కెట్లు తెలంగాణలో ఉన్నాయి. వీటిని ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఆన్లైన్ లింకింగ్ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అందుకు అవసరమైన పరికరాల కొనుగోలుకు కేంద్రం రూ.24 కోట్లు విడుదల చేయనుంది. మరోవైపు కొత్త రిజర్వేషన్ల ప్రకారం, మార్కెట్ కమిటీల చైర్మన్ల నియామకాలకు వీలుగా చేసిన చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్లో తీసుకున్న మరిన్ని నిర్ణయాలివీ.. ⇒రాష్ట్ర ఆర్టీసీని ఆదుకునేందుకు రూ.500 కోట్ల రుణం తీసుకునేందుకు పూచీకత్తు ఇవ్వాలని నిర్ణయం జీహెచ్ఎంసీలో విలీనమైన 12 శివారు మున్సిపాలిటీల పరిధిలో తాగునీరు, సీవరేజీ మౌలిక వసతుల కల్పనకు హడ్కో నుంచి రుణ సమీకరణకు ఆమోదం ⇒ కొత్త ఐటీ, మైనింగ్, కల్చరల్ పాలసీలపై చర్చించాలని నిర్ణయం ⇒రాష్ట్రంలో కొత్తగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు. వచ్చే బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయింపు ⇒మహబూబ్‌నగర్ జిల్లాలో ఫిషరీస్ ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటు ⇒రాష్ట్ర సాంస్కృతిక విభాగాన్ని బలోపేతం చేసేందుకు నిర్ణయం. ⇒వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రులు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ⇒ఐఏఎస్ అధికారుల సంఘానికి మూడెకరాల స్థలం కేటాయింపునకు ఆమోదం ⇒ హైదరాబాద్‌లో లక్ష సీసీ కెమెరాలు ⇒ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలుకు ఉమ్మడి రాష్ట్రంలోని చట్టాన్ని తెలంగాణకు అన్వయించుకునేందుకు ఆమోదం ⇒ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, జీహెచ్ఎంసీతోపాటు మున్సిపల్ చట్టాన్ని సవరిస్తూ ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్‌లను బిల్లు రూపంలో తీసుకువచ్చేందుకు ఆమోదం ⇒ మైనారిటీ విభాగంలో 20 రెగ్యులర్, 19 అవుట్ సోర్సింగ్ పోస్టుల మంజూరు, ఆరోగ్య శాఖలో 23 పోస్టుల మంజూరు -
వివాహిత ఆత్మహత్య
రెండురోజుల కిందట ఇంటి నుంచి అదృశ్యమైన వివాహిత కాముని చెరువులో మృతదేహాంగా భయటపడిన సంఘటన ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలోని సిద్దేశ్వరకాలనీకి చెందిన పస్తం రమేష్ భార్య సుగుణ (22) కూరగాయలు తీసుకొస్తానంటు ఈ నెల 27 మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయలుదేరింది. ఎంతకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు అన్ని చోట్లా వెతికారు. గురువారం సాయంత్రం ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో సుగుణ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మహిళ అదృశ్యం కింద కేసు కూడా నమోదు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం కాముని చెరువులో మహిళ మృతదేహుం తేలియాడుతుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వారి కుటుంబ సభ్యుల ఆధారంగా మృతదేహం అదృశ్యమైన సుగుణదిగా నిర్ధారించారు. ఇంట్లో తరచు చోటు చేసుకుంటున్న కుటంబకలహాల కారణంగానే సగుణ ఆత్మహత్యకు పాల్పడిందని వారి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమేష్‌తో సుగుణ వివాహం పదినెలల కిందటే జరిగిందని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.