పంచ మహాయజ్ఞాలలో మొదటిది అధ్యాపనం అంటే ఒకరికి చెప్పడం. మరొకరికి చె΄్పాలంటే ముందు మనం చదవాలిగదా! దేనికోసం... కర్తవ్యమ్. అదేమిటో ముందు మనం తెలుసుకోవాలి. అంటే కర్తవ్యమే ధర్మం. ధర్మం ఎప్పుడూ ఒక్కలాగా ఉండదు. నిరంతరం మారి΄ోతుంటుంది. ఎప్పుడు ఏ ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో చెప్పవలసివస్తే... చెప్పేవారు.. ఎవరి మనోభావాలనుబట్టి వారు చెవుతుంటారు. నాకేది ఇష్టమో నేనదే ధర్మమని చెబుతా. ఇంకొకాయన ఆయనకు నచ్చినది ధర్మమని చెబుతాడు. అప్పుడు నిజానికి ఏది ధర్మం?
ధర్మం చెప్పడానికి ఒక ప్రమాణం ఉండాలి. అది ఏది అంటే ... యోగమే. యోగం ఎవరు ? భగవంతుడే. నాకూ నా ఊపిరికీ తేడా లేదు. నేను ఊపిరి తీసి విడిచిపెడుతున్నంతకాలం ‘నేను’ ఉన్నాను–అంటారు. నా ఊపిరే నా వాక్కుగా మారుతున్నది. అలాగే భగవంతుని ఊపిరి వాక్కుగా మారితే అదే వేదం. అందుకే భగవంతుడికీ, వేదానికీ వ్యత్యాసం ఉండదు. వేదం ఎంత సనాతనమో భగవంతుడంత సనాతనం. భగవంతుడిని ఎవరూ సృష్టించలేదు. ఆయనే అన్నీ సృష్టించాడు. వేదం కూడా అంతే.. అ΄ûరుషేయం. దానిని ఎవరూ రాయలేదు. అందుకే వేదం, ఈశ్వరుడూ ఒకే స్వభావంతో ఉంటారు. కారణం – నిజానికి అవి రెండు కాదు కాబట్టి. అటువంటి వేదం ధర్మం చెప్పడానికి మొదటి ప్రమాణం.
నేను వేదం చదువుకోలేదని ఎవరయినా అంటే!!! వేదాంతర్గతమైన ఆచార సంబంధ నియమాలను రుషులు క్రోడీకరించి ఇచ్చారు. గౌతముడిస్తే అది గౌతమ స్మృతి అయింది. అత్రి ఇస్తే అత్రి స్మృతి, యాజ్ఞవల్క్యుడిస్తే యాజ్ఞవల్క్య స్మృతి.. అలా ఈ స్మృతి గ్రంథాలు ప్రమాణం. ఆవువెంట దూడ ఎలా వెడుతుందో శ్రుతి వెంట స్మృతి అలా వెడుతుంది..అంటాడు కాళిదాసు. కాబట్టి శ్రుతి తరువాత స్మృతి ప్రమాణం.
స్మృతిగ్రంథాలు కూడా తెలియవని అంటే...!!! పురాణం ప్రమాణం. పురాణం జరిగి΄ోయిన చరిత్ర కాదు. కల్పింపబడిన కథ కూడా కాదు. జాగ్రత్తగా పరిశీలించండి... కల్పనయితే అందులో రచయిత వేరు, కథావస్తువు వేరుగా ఉంటుంది. అందువల్ల ఇది కల్పన కాదు. పురాణాలను ఇతిహాసములు–అంటారు. ఇతిహాసం... అంటే ‘‘ఇది ఇట్లే జరిగినది. అందులో అనుమానం లేదు’’... అని.రామాయణంలో వాల్మీకి మహర్షి అంతర్భాగం. ఆయనది పాత్రకాదు. అందులో ఒక వ్యక్తి. అలాగే భారతంలో, భాగవతంలో వ్యాసుడు అంతర్భాగం. అంతేకానీ వ్యాసుడు వేరు, భారత భాగవతాదులు వేరు కావు. అది వాళ్ళ కాలంలో యధార్థంగా జరిగిన విషయాలను వాళ్ళు రచించి మనకిచ్చారు. అవి జీవుడి ప్రస్థానాన్ని పూర్తిగా చెబుతాయి.
అందుకే పురాణాలు చదివితే ఒక స్పష్టత ఏర్పడుతుంది. అందువల్ల పురాణం ప్రమాణం.నాల్గవది. శిష్టాచారం. యద్య దాచరతి శ్రేష్ఠ స్తత్త దేవేతరోజనః / స యత్ప్రమాణం కురుతే లోక స్తదనువర్తతే’’ అంటాడు గీతాచార్యుడు. శ్రేష్టులయినవారు, శాస్త్రమెరిగినవారు... లోకంలో ఎలా ప్రవర్తిస్తారో దాన్ని మిగిలినవారంతా అలా అనుకరిస్తారు’’ అని. ధర్మం చెప్పడానికి, అనుసరించడానికి ఈ నాలుగు మార్గాలు ్రపామాణికం.
Comments
Please login to add a commentAdd a comment