గృహప్రవేశం చేయాలి. అప్పుడు యజుర్వేదం అంతా మనకు వచ్చా, రాదా అన్న దానితో సంబంధం లేదు. గృహప్రవేశ సందర్భంలో రాముడేం చేసాడో ఆ ఘట్టం చదువుకుంటే చాలు... ఓహ్, గృహప్రవేశం ఇలా చేయాలన్న మాట.. అన్నది తెలుస్తుంది. తండ్రిగారికి తద్దినం పెట్టాల్సి వస్తే రాముడేం చేశాడో చదువుకుంటే సరిపోతుంది. అది పెట్టవలసి వచ్చినప్పుడు ఇలా పెట్టాలని అర్థమవుతుంది. అందుకే వేదం రామాయణంగా ప్రవర్తించింది.
చంద్రవంశాన్ని అంతటినీ వ్యాసుడు రచించాడు. సూర్యవంశాన్ని అంతటినీ కూడా వాల్మీకి వర్ణించాడు. సూర్యుడు, చంద్రుడు పగలూ రాత్రి ప్రకాశిస్తారు. ఒక పగలు, ఒక రాత్రి కలిస్తే ఒక రోజు పూర్తవుతుంది. వాఞ్మయంలో రామాయణం, భారతం ఇతర పురాణాలను వాల్మీకి, వ్యాసుడు అందించారు. స్వార్థంతోనో, ప్రత్యుపకారం ఆశించో కాక దీనివల్ల ధర్మానుష్ఠాన పద్ధతులను అందరికీ అర్థమయ్యే పద్ధతిలో విడమరిచి చెప్పకపోతే జనసామాన్యానికి ఎలా తెలుస్తుందనే సదుద్దేశంతో వారు మనకు ఈ మహోపకారం చేసారు.
వివాహం ఎంత గొప్పది! వివాహం అంటేనే విశిష్టమైనది–అని. దానిని మనకు సం్ర పాప్తింప చేయడానికి జరిపే సంస్కారమే వివాహం. అది ఏదో సరదాకోసం కాదురా నాయనా, వివాహం చేసుకుంటా నంటున్నావు కదా, ముందు దానిగురించి, దానిలోని ధర్మసూక్ష్మాలను గురించి తెలుసుకో. వివాహం అంటే విశిష్టమైనదానిని ΄పోందుట. మరి ఆ విశిష్టమైనదేది? అదే మోక్షం. దీనిని ΄÷ందడానికి యోగ్యమైనది ధర్మానుష్ఠానం. అది సక్రమంగా జరగకుండా దానికి అడ్డుపడుతున్నవి ఏవి? అర్థకామాలు రాగద్వేషాలయి ΄ాపపుణ్యాలకు, పునర్జన్మలకు కారణమవుతాయి. అలాకాకుండా దానిని ధర్మబద్ధం చేసి పాశాలు విడిపోవడానికి సంసార ప్రవేశం జరగాలి. అటువంటి గృహస్థాశ్రమంలోకి నీవు ప్రవేశిస్తున్నావు.
అలా ప్రవేశించి రాముడేం చేసాడో తెలుసా? సీతారామకళ్యాణ ఘట్టం చూడు. అక్కడ సీతమ్మ ఏం చేసింది ? అసలు పెద్దవాళ్ళనే వాళ్ళు పెళ్ళికూతురిని, పెళ్లికొడుకుని కూర్చోబెట్టి ఏం మాట్లాడారో పరిశీలించు. పెద్దరికం అంటే ఏమిటో కూడా తెలుస్తుంది. ఇవన్నీ తెలిస్తే సంసారంలో ఎప్పటికప్పుడు ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి, కుటుంబ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ ఉద్దేశంతో రుషులు దేశకాలాలతో సంబంధం లేకుండా సర్వకాలాల్లో సర్వజనులకు ఉపయోగపడే విధంగా వాటిని అందించారు. అటువంటి రుషుల రుణం మనకు జన్మతః ఉంది.
మీరు ఎంతో చదువుకున్నారు... సరే. మంచిదే. నేను చదువును తక్కువ చేసి చెప్పడం లేదు. కానీ చదువుతో ΄ాటుగా నిత్యజీవితంలో మనిషి మనిషిగా ఉండడానికి కావలసిన మానవత్వాన్ని నిలబెట్టడం చాలా అవసరం. అలా అది నిలబడాలంటే... రామాయణం, భారతం తదితర గ్రంథాలను బాగా పరిశీలించాలి. అవి నిత్యపారాయణకు యోగ్యత ఉన్న గ్రంథాలు. వాటిని కనీసం రోజుకో అధ్యాయం చొప్పున అయినా చదువుకుంటూ ఉండాలి. ఇంటిపట్టున పెద్దవాళ్ళు పిల్లలతో వాటిగురించి తరచూ మాట్లాడుతూ ఉండాలి. దానివల్ల ధార్మిక జీవనం అలవడడమేగాక, మనుషుల్లో మానవత్వం మిగులుతుంది. అది లేనప్పుడు మీరు సమకూర్చుకున్న జ్ఞానం, ప్రతిభా΄ాటవాలు సమాజానికి ప్రమాదకరంగా మారవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment