నల్లధనంతో విద్య, ఉపాధి: దత్తాత్రేయ
సిద్దిపేట జోన్: నల్లధనంతో గరీబ్ కల్యాణ్ యోజన కింద విద్య, వైద్యం, ఉపాధి కల్పిస్తామని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం కార్మిక సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో నగదు రహిత లావాదేవీలపై అసంఘటితరంగ కార్మికులకు అవగాహన సదస్సును నిర్వహించారు.
ఇందులో దత్తాత్రేయ మాట్లాడుతూ డబ్బులు దొరకడం లేదని విపక్షాలు కావాలనే అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. డిజిటల్ లిటరసీ ద్వారా మార్పునకు ప్రధాని మోదీ ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆర్బీఐ ద్వారా తెలంగాణకు మరో పదిరోజుల్లో రూ.5 వేల కోట్లు రానున్నాయన్నారు.