మోదీ నిర్ణయాన్ని స్వాగతించాలి: దత్తాత్రేయ
హైదరాబాద్: దేశంలో దాగిఉన్న నల్లధనాన్ని వెలికితీయాలన్న నిర్ణయంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పెద్దనోట్ల రద్దు కార్యక్రమాన్ని ప్రతి వ్యక్తి స్వాగతించాలని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. ఎప్సీఆర్ హిల్స్‌లోని ఓంనగర్ బస్తీలో స్థానిక బీజేపీ నేతలు నోట్ల రద్దు, డిజిటల్ లావాదేవీలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. దేశంలో వేలకోట్లలో నల్లధనం దాగి ఉందన్న విషయాన్ని గ్రహించిన ప్రధాని మోదీ దానిని వెలికితీయాలనే ఉద్దేశ్యంతో పెద్దనోట్ల రద్దు కార్యక్రమాన్ని సాహసోపేతంగా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.