గర్భగుడిలో.. బీజేపీ నేత ఆత్మహత్య | BJP leader commits suicide inside temple | Sakshi
Sakshi News home page

గర్భగుడిలో.. బీజేపీ నేత ఆత్మహత్య

Published Wed, Jul 19 2017 9:37 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

గర్భగుడిలో.. బీజేపీ నేత ఆత్మహత్య - Sakshi

గర్భగుడిలో.. బీజేపీ నేత ఆత్మహత్య

బెళగావి: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చెందిన నాయకుడు ఒకరు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో బైలవంగల తాలుకాలోని తురక రశీగేహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శివనగౌడ్‌ పాటిల్‌(53) బీజేపీ బ్లాక్‌ విభాగం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

మంగళవారం గ్రామంలోని గిరిమల్లేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లిన ఆయన.. గర్భగుడిలోకి ప్రవేశించారు. వెంట తెచ్చుకున్న రివాల్వర్‌తో తన తలకు గురిపెట్టుకుని కాల్చుకుని అక్కడే ఆత్మహత్య చేసుకున్నారు. స్ధానికుల సమాచారంతో ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాటిల్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement