
‘జనాల స్థితి దారుణం.. నాక్కూడా ఆరువేలే’
విజయవాడ: పెద్ద నోట్ల రద్దుపై బీజేపీలో కూడా అసహన జ్వాలలు మొదలయ్యాయి. నోట్ల రద్దు కారణంగా జనాలు పడుతున్న అవస్థలు చూసి తనకు కూడా ఆగ్రహం వేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు.
నాలుగు రోజుల కిందటే తాను సహనం కోల్పోయానని తెలిపారు. నోట్ల రద్దుతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బ్యాంకుల తీరు అత్యంత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రూ.24వేలు డ్రా చేసేందుకు వెళితే రూ.ఆరువేలు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. కోట్లు కూడగట్టిన బ్లాక్ మనీ వాళ్ల దగ్గర మాత్రం కొత్త కరెన్సీ విచ్చలవిడిగా దొరుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.