ఎన్నికల్లో గెలుపే లక్ష్యం రిజర్వుడు స్థానాలపై కమలం గురి | BJP targets 25 lakh Dalit votes in Delhi Assembly elections | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో గెలుపే లక్ష్యం రిజర్వుడు స్థానాలపై కమలం గురి

Published Fri, Dec 12 2014 11:28 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

ఎన్నికల్లో గెలుపే లక్ష్యం రిజర్వుడు స్థానాలపై కమలం గురి - Sakshi

ఎన్నికల్లో గెలుపే లక్ష్యం రిజర్వుడు స్థానాలపై కమలం గురి

సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికల్లో రిజర్వ్ స్థానాలను సైతం తన ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లోని దళిత, దళితేతర ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ఆరంభించింది. ఇందులోభాగంగాఇప్పటికే   రెండు భారీ ర్యాలీలను కూడా నిర్వహించింది. ఢిల్లీ బీజేపీలో యోగేంద్ర చందోలియా మినహా పేరున్న దళిత నేత ఒక్కరు కూడా  ఒక్కరు కూడా లేదు. ఆయన ప్రస్తుతం ఉత్తర ఢిల్లీ మేయర్‌గా ఉన్నారు.

గత విధానసభ ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఈసారి బీజేపీ తన  తప్పిదాలను సరిదిద్దుకోవాలనుకుంటోందని సమాచారం. యోగేంద్ర చందోలియాకు కరోల్‌బాగ్  టికెట్ ఇవ్వడమేకాకుండా దళిత ఓటర్లు అధికంగా ఉన్న రిజర్వ్‌డ్ నియోజకవర్గాలలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌కు చెందిన షెకు నేతలతో  ప్రచారం నిర్వహించనుంది.  ప్రతి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించడం కోసం మొత్తం 70 స్థానాల్లో ముగ్గురు చొప్పున పరిశీలకులను నియమించనుంది. రిజర్వ్‌డ్ నియోజకవ ర్గాల్లో మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రకు చెందిన ప్రముఖ నేతలను పరిశీలకులుగా నియమించనుంది.

ఢిల్లీలో మొత్తం 12 రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మంగోల్‌పురి ,సులాన్‌పుర్ మజ్రా, అంబేద్కర్‌నగర్ దేవ్లీ, కోండ్లీ స్థానాల్లో ఆ పార్టీ ఏనాడూ గెలుపు నమోదు చేయలేదు.  పటేల్‌నగర్. మాదీపుర్, త్రిలోక్‌పురి, సీమాపురి, గోకుల్‌పుర్ లను ఒక్కసారి మాత్రమే గెలుచుకుంది.  కరోల్‌బాగ్ సీటును మూడు సార్లు, బవానా సీటును రెండుసార్లు దక్కించుకుంది. గత విధానసభ ఎన్నికలలో బవానా , గోకుల్‌పుర్ సీట్లు కమలానికి దక్కాయి.

సుల్తాన్‌పుర్ మాజ్రా సీటు కాంగ్రెస్ దక్కించుకోగా మిగతా సీట్లలో ఆప్ విజయం సాధించింది. కాగా ఢిల్లీలో 25 లక్షల మంది దళిత ఓటర్లున్నారని అంచనా. ఇక్కడి దళితులను కాంగ్రెస్ ఓటుబ్యాంకుగా పరిగణించేవారు. గత విధానసభ ఎన్నికలలో అత్యధికశాతం మంది దళితులు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు  మొగ్గు చూపారు. ఫలితంగా  షెడ్యూల్డు కులాలకు రిజర్వ్ చేసిన 12 నియోజకవర్గాలలో తొమ్మిందింటిని ఆప్ గెలుచుకోగా, కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకుంది. బీజేపీ కేవలం రెండింటికే పరిమితమైన సంగతి విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement