కమలం.. ధూంధాం | Bjp victory | Sakshi
Sakshi News home page

కమలం.. ధూంధాం

Published Wed, Aug 26 2015 4:09 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కమలం.. ధూంధాం - Sakshi

కమలం.. ధూంధాం

సాక్షి, బెంగళూరు :  బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికల్లో గెలుపు రాష్ట్ర బీజేపీ నాయకులకు కొత్త ఉత్సాహం తీసుకువచ్చింది. దీంతో కమలనాథుల సంబరాలు అంబరాన్ని అంటాయి. బీబీఎంపీ ఎన్నికల ఫలితాలు వెలువడటం మొదలయినప్పటి నుంచి దాదాపు ప్రతి వార్డులో బీజేపీ అధిక్యతలోనే కొనసాగుతూ వచ్చింది. దీంతో ప్రతి గంటకూ కమలనాథుల ధూంధాంలు... తీన్‌మార్‌లతో ఆయా వార్డులు హోరెత్తి పోయాయి. ఇక విజయం ఖాయమై పోవడంతో  అనంతకుమార్, సదానందగౌడ, ఆర్.అశోక్ తదితర అగ్రనాయకులంతా నగరంలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకున్నారు.

గెలిచిన అభ్యర్థులతో పాటు పార్టీ కార్యకర్తలతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇదిలా ఉండగా బీబీఎంపీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా బెంగళూరుకు మంగళవారం సాయంత్రం చేరుకున్నారు. పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అగ్రనాయకులను కలుసుకుని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఫలితాలు రానున్న ఎన్నికలకు దిక్సూచి. నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు. రాష్ట్ర ప్రభుత్వాన్ని తిరస్కరించారనడానికి ఈ ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ.’ అని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement