న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు బీజేపీకి మంచి ఊపు వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీని యర్ నాయకుడు బూటాసింగ్ కుమారుడు అర్విందర్‌సింగ్ లవ్లీతోపాటు అనేకమంది మంగళవారం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వీరితోపాటు ఆప్, కాం గ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు కూడా కమలతీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ మీడియాతో మాట్లాడుతూ లవ్లీ... తమ పార్టీలో చేరికతో దళిత ఓటర్ల మద్దతు బాగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల తర్వాత ఢిల్లీలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం అర్విందర్‌సింగ్ లవ్లీ మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో తన తండ్రికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదన్నారు. ఈ కారణంగా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరు తనకు ఎంతో బాగా నచ్చిందన్నారు. ఆయన సారథ్యంలో దేశం ఎంతో బాగా పురోగమిస్తుందన్నారు.
మళ్లీ ‘దేవ్లీ’నుంచే బరిలోకి...
2008లో జరిగిన విధానసభ ఎన్నికల్లో దేవ్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన లవ్లీ విజయం సాధించారు. అయితే 2013 నాటి ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి ప్రకాశ్ చేతిలో పరాజయం పాలయ్యారు. లవ్లీ చేరిక విషయమై బీజేపీ నాయకుడొకరు మాట్లాడుతూ తండ్రి ప్రతిష్టను ఓట్లుగా మలుచుకోవాలనుకుంటున్నారన్నారు. వచ్చే నెల ఏడో తేదీన జరగనున్న విధానసభ ఎన్నికల్లోనూ లవ్లీని దేవ్లి నియోజకవర్గంనుంచే బరిలోకి దించుతామన్నారు. ఇదిలాఉంచితే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సందీప్ దూబే, చంద్రకాంత్ దూబేలు బీజేపీలో చేరారు. ఇంకా రాష్ట్రీయ లోక్‌దళ్ కౌన్సిలర్ అనితా త్యాగి, కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ దీపక్ చౌదరి, డీపీసీసీ కార్యదర్శి శశికాంత్ దీక్షిత్, గోపాల్ పహరియాలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఎన్నికలకు ముందు బీజేపీకి బూస్ట్
Published Tue, Jan 13 2015 10:43 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement