
అక్షయ షణ్ముగం
టీ.నగర్: వ్యసనాలను అడ్డుకునే సాంకేతిక సాధనాన్ని చెన్నైకు చెందిన యువతి రూపొందించింది. దీన్ని ఉత్తమ ఆవిష్కరణగా ఫోర్బ్స్ పత్రిక ప్రకటించింది. అమెరికా నుంచి బైవీక్లీగా ఫోర్బ్స్ పత్రిక విడుదలవుతోంది. ప్రతి ఏడాది ప్రపంచస్థాయిలో ఉత్తమ ఆవిష్కరణలుగా ఎం పికైన వాటిని, ఉత్తమ వ్యక్తులను ఎంపిక చేసి ఈ పత్రిక విడుదల చేస్తున్నది. ఈ ఏడాదికి సంబంధించిన ఉత్తమ వ్యక్తుల జాబితాను ఈ పత్రిక గురువారం విడుదల చేసింది. ఈ జాబితాలో వివిధ రం గాలకు చెందిన సుమారు 600 మంది చోటుచేసుకున్నారు. ఇందులో యువ సాధకురాలిగా చెన్నైకు చెందిన అక్షయ షణ్ముగం ఎంపికయ్యారు. ఈమె అన్నావర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభా గంలో చదివి పట్టా పొందారు.
తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లా రు. ప్రస్తుతం అక్కడున్న మసాచుసెట్స్ వర్సిటీలో పరిశోధకురాలిగా ఉన్నారు. ఇటీవల ఆమె సిగిరెట్, బీడీ, సిగార్ వ్యసనాల బానిసలు తమ అలవాటు నుంచి విముక్తి చెందేందుకు అత్యాధునిక సాఫ్ట్‌వేర్ రూపొందించారు. ఒకరు సిగిరెట్ తాగాలనుకున్నప్పుడు ఎందుకు ఆ ఆలోచన ఏర్పడుతుందో ఆ సాఫ్ట్‌వేర్ చెబుతుంది. అంతేకాకుండా ధూమపాన వ్యసనం నుంచి విముక్తి చెందేందుకు హెచ్చరికలు చేస్తుంది. దీంతో కొద్ది రోజుల్లో ధూమపానం చేసేవారు అలవాటు నుంచి విముక్తి పొందుతారని అక్షయ షణ్ముగం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment