డ్రగ్స్ పరిశ్రమపై హెచ్చార్సీలో ఫిర్యాదు
Published Sat, Sep 17 2016 4:20 PM | Last Updated on Tue, Oct 16 2018 8:46 PM
హైదరాబాద్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ సమీపంలోని ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వదులుతున్న వ్యర్థాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ యువజన కాంగ్రెస్ నేతలు శనివారం హెచ్చార్సీని ఆశ్రయించారు. రసాయనాల పరిశ్రమలు వెదజల్లే కాలుష్యాల కారణంగా చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.
హెచ్చార్సీకి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఆప్టిమస్ పరిశ్రమ వద్దకు నిజ నిర్ధారణకు వెళ్లిన యువజన కాంగ్రెస్ నేతలపై యాజమాన్యం దాడులకు పాల్పడిందని ఆరోపించారు. దాడి విషయమై తాము ఫిర్యాదు చేసినా పోలీసులు స్వీకరించలేదని, అందుకే హెచ్చార్సీకి ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
Advertisement
Advertisement