డయల్‌పై దయెందుకు? డీఎంఆర్‌సీపై కాగ్ మండిపాటు
Published Sat, Aug 10 2013 2:59 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్ మెట్రోలైన్ నిర్మాణ పనులకు సంబంధించి చోటుచేసుకున్న అవకతవకలపై డీఎంఆర్‌సీకి కాగ్ అక్షింతలు వేసింది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్(డయల్)కు లాభం చేకూర్చేవిధంగా వ్యవహరించిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. రూ. 448 కోట్ల చెల్లింపులకు సంబంధించి మినహాయింపులివ్వడం అందులోభాగమేనని పేర్కొంది. ‘ఎయిర్ మెట్రోలైన్ నిర్మాణ సమయంలో డయల్, డీఎంఆర్‌సీకి రూ. 350 కోట్లు చెల్లించాలి. ఈ ప్రతిపాదనను మంత్రి మండలి కూడా ఆమోదించింది.
ఆ తర్వాత ఎనిమిదో నంబ ర్ జాతీయ రహదారి సమీపంలో మెట్రో స్టేషన్‌ను నిర్మించాలని, దాని వాణిజ్య హక్కులను పొందుతున్నందుకు రూ. 98 కోట్ల చెల్లించేందుకు కూడా డయల్ అంగీకరించింది. మొత్తం 448 కోట్లను 2009 జూన్, సెప్టెంబర్, డిసెంబర్, 2010 మార్చిలోనే చెల్లించాల్సి ఉన్నా విడతలవారీగా చెల్లించేం దుకు డీఎంఆర్‌సీ అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ డయల్ ఒప్పందం ప్రకారం చెల్లించడంలో విఫలమైంది. గడువు ముగిసేనాటికి కూడా డీఎంఆర్‌సీకి, డయల్ రూ. 54.43 కోట్లు బకాయి పడే ఉంది. ఇదంతా డయల్‌కు లాభం చేకూర్చేందుకే చేసిం ద’ని డీఎంఆర్‌సీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
పభు త్వ ప్రైవేటు భాగస్వామ్య నిర్మాణంలో జరిగిన ఈ లైన్ పనుల్లో ఎక్కువ వాటా ప్రైవేటు కంపెనీకే ఉం డడంతో దానికి లాభం చేకూర్చే విధంగా అవకతవకలు జరిగాయని కాగ్ ఆరోపించింది. అంతేకాక కస్ట మ్స్ విభాగానికి కూడా డీఎంఆర్‌సీ లేఖ రాసిం దని, దిగుమతి సుంకంలో మినహాయింపునివ్వాలని కోర డం ద్వారా సదరు ప్రైవేటు కంపెనీకి లాభం చేకూర్చేలా వ్యవహరించిందని ఆరోపించింది. అయితే డీఎంఆర్‌సీ మాత్రం కాగ్ ఆరోపణలను కొట్టిపారేసింది. తామెవరికీ లాభం చేకూర్చేలా వ్యవహరించలేదని లిఖిత పూర్వక వివరణ ఇచ్చింది.
Advertisement