యాదగిరిగుట్టలో కాంగ్రెస్ ర్యాలీ
Published Fri, Oct 21 2016 2:04 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
యాదగిరిగుట్ట: విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్, రైతులకు ఏక విడతలో రుణమాఫీ చేయాలని కోరుతూ యాదగిరిగుట్ట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన విధంగా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి రుణాలు మాఫీ చేయాలని.. విద్యార్థులకు వెంటనే రియింబర్స్‌మెంట్ అందజేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement