రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రోష్ దిన్: ఉత్తమ్
హైదరాబాద్: ఈ నెల 28న చేపట్టబోయే భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఏఐసీసీ నిర్ణయం మేరకు సోమవారం చేపట్టే ఆక్రోష్ దినాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహిస్తామన్నారు. అకస్మాత్తుగా పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులను కేంద్రానికి అర్ధమయ్యే విధంగా నిరసన కార్యక్రమలు, ర్యాలీలు, నల్లజెండాల ప్రదర్శనలు, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనాల కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అదే విధంగా నగరంలోని ఆర్బీఐ కార్యాలయం ఎదుట మానవహారం చేపట్టనున్నట్టు తెలిపారు.