కార్పొరేషన్లు, బోర్డులకు ప్రాధాన్యం
మండ్య: పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మొదట కార్పొరేషన్లు, బోర్డు ల నియామకంలో ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. పాండవపుర తాలూకా బన్నంగాడి గ్రామంలోని జూనియర్ కళాశాల ఆవరణలో శనివారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్లు, బోర్డుల్లో నియమాకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ ఆదేశించిందని తెలిపారు. ఈ క్రమంలోనే అభ్యుర్థులను నియమించడానికి అన్ని చర్య లూ తీసుకున్నామన్నారు.
త్వరలోనే జాబితా విడుదల చేస్తామని చెప్పా రు. బోర్డుల నియామకం అనంతరం మంత్రి వర్గ విస్తరణను చేపడతామని వివరించారు. నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి రశ్మి మహేష్‌పై జరిగిన దాడిపై విచారణ చేసేందుకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇప్పటికే ఆమె దాడి చేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేశామన్నారు.
అధికారుల నివేదిక వచ్చిన తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బెంగళూరు నగరంపై ఉగ్రవాదులు దృష్టిసారించిన విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం స్పందిస్తూ ఐసీఎస్ ఉగ్రవాదులు బెంగళూరును టార్గెట్ చేసిన విషయం తెలిసిందన్నారు. ఉగ్రవాదుల దాడికి ఎదుర్కోవడానికి అన్ని చర్యలూ ప్రభుత్వం తీసుకుంటుందని వివరించారు.