వైభవంగా దసరా శరన్నవరాత్రులు
తగరపువలస : మూలా నక్షత్రంను పురస్కరించుకుని శనివారం బైపాస్‌రోడ్డులోని విజయదుర్గ ఆలయంలో అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు. అంబేడ్కరు కూడలి లోని మండపంలో విశ్వేశ్వరశర్మ, సంతపేట రెడ్డివీధిలో మేకా శంకరశర్మ అక్షరాభ్యాసాలు నిర్వహించారు. సంగివలస కొత్తమ్మవారి ఆలయంలో శనివారం నుంచి చండీహోమం ప్రారంభించారు. టి.నగరపాలెంలో సరస్వతీపూజ చేశారు.
చదువుల తల్లికి వందనం
పీఎం పాలెం : చదువుల తల్లి సరస్వతీ దేవికి భక్తులు, విద్యార్థులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. బబ్బేలమ్మ అలయంలలో, పీఎం పాలెం ఆఖరు బస్టాపు సమీపంలోని శృంగేరి శంకర మఠం పీఠంలోని శారదాంబ అలయ మండపంలో బాలలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు.
బక్కన్నపాలెం పోలీస్ శిక్షణ కేంద్రంలో ...
బక్కన్నపాలెం పోలీస్ శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో 16వ బెటాలియన్ కమాండెంట్ కె. సూర్యచంద్‌ణాధ్వర్యంలో సరస్వతీదేవి ఆరాధన అనంతరం సిబ్బంది పిల్లలకు పుస్తకాలు , పెన్నలు తదితర సామగ్రి అంద జేశారు.
భూలోకమాత ఆలయప్రాంగణంలో
రేవళ్లపాలెం(మధురవాడ): రేవళ్లపాలెంలోని శ్రీ భూలోకమాత ఆలయం లో శనివారం 300 మంది పిల్లలకు సామూహిక విద్యాభ్యాసాలు చేశారు. అర్చకులు రాజేటి గురునాథ శర్మ అమ్మవారికి బెవర బాపూజీ, శ్రామణి, వాం డ్రాసి సూరప్పారావు, శ్యామల, పెంటారావు, జానకీ దంపతులతో పూజలు చేయించారు. చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయంలో మహా కుంభాభిషేకం నిర్వహించారు. చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని సరస్వతీ దేవి ఆలయం వద్ద హెచ్‌ఎం రాజబాబు, పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు పి.దుర్గా ప్రసా ద్, పిళ్లా సూరిబాబు, పి.కృష్ణమూర్తి పాత్రుడు, ఉపాధ్యాయులు పూజలు నిర్వహించారు.