Saraswathi matha
-
బాసర: రేపటి నుంచి అర్జిత సేవలు బంద్
సాక్షి, బాసర(నిర్మల్): కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలు, మాల్స్, థియోటర్లు, రెస్టారెంట్లతో పాటు ప్రముఖ దేవాలయాలను కూడా మూసివేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న(గురువారం) వేములవాడ రాజన్న ఆలయం మూసివేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో రేపటి(శనివారం) నుంచి అర్జిత సేవలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ శుక్రవారం ఆదేశాలు జారి చేసింది. (రాజన్న ఆలయం మూసివేత) ఇక రేపటి నుంచి భక్తులు ఆలయాలని రావోద్దని ఆలయ అధికారులు సూచించారు. ఆలయంలో జరిగే అక్షరాభ్యాసం, కుంకుమార్చన వివిధ అర్జిత సేవలు నిలిపివేయాలని కూడా ఆదేశాలు జారి చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. కాగా కరోనా వైరస్ దృష్టిలో పెట్టుకుని భక్తులు తమకు సహకరించాలని విజ్ఙప్తి చేశారు. ఇక ఆలయంలో వేకువ జామునే జరిగే సరస్వతి అమ్మవారి అభిషేకం, హారతి పూజలు యధావిధిగా జరుగుతాయని అధికారులు వెల్లడించారు. -
సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు
విజయవాడ : చదువుల తల్లి శ్రీ సరస్వతి మాత పుట్టిన రోజు అయిన వసంత పంచమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారు మహాసరస్వతి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహామండపంలోని యాగశాలలో ఆలయ అధికారులు ఉదయం 8 గంటలకు సరస్వతీ హోమాన్ని నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలి వస్తుండటంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. చిన్నారులకు అక్షరాభ్యాసాలు కూడా నిర్వహిస్తున్నారు. విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షిస్తూ ఆలయ అర్చకులు అమ్మవారి చెంత పూజలు చేసిన శక్తి కంకణాలను, పెన్నులను విద్యార్థులకు అందజేస్తున్నారు. అంతరాలయం, మహామండపం 6వ అంతస్తుల్లోని ఉత్సవమూర్తిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. బాసర: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో వసంతి పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే అమ్మవారికి మంగళవాద్యసేవ, సుప్రభాత సేవలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి అలంకరణ, నివేదన, మహాహారతి చేపట్టారు. ఇవాళ అమ్మవారికి చండీహవనం, వేదపారాయణం, మహాపూజ కార్యక్రమాలతో పాటు సాయంత్రం అమ్మవారిని పల్లకిలో ఊరేగిస్తారు. తెల్లవారుజామునుంచే భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచి అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించేందుకు ఆలయానికి వచ్చారు. అమ్మవారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. హైదరాబాద్ : నల్లకుంటలోని శంకరమఠం, శ్రీ సీతారామాంజనేయ సరస్వతి ఆలయంలో బుధవారం ఉదయం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శంకరమఠంలో శారదాంబ అమ్మవారు జ్ఞాన సరస్వతి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. న్యూనల్లకుంటలోని శ్రీసీతారామాంజనేయ సరస్వతి ఆలయంలో 108 కలశాల ఆవుపాలతో జ్ఞాన సరస్వతి అమ్మవారికి విశేష అభిషేకం చేశారు. ఈ కార్యక్రమాల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. విజయనగరం : విజయనగరం రింగు రోడ్డులో గల జ్ఞాన సరస్వతి ఆలయంలో శ్రీ పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వేల సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలి వచ్చారు. ఈ సందర్భంగా పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించారు. -
వైభవంగా దసరా శరన్నవరాత్రులు
తగరపువలస : మూలా నక్షత్రంను పురస్కరించుకుని శనివారం బైపాస్రోడ్డులోని విజయదుర్గ ఆలయంలో అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు. అంబేడ్కరు కూడలి లోని మండపంలో విశ్వేశ్వరశర్మ, సంతపేట రెడ్డివీధిలో మేకా శంకరశర్మ అక్షరాభ్యాసాలు నిర్వహించారు. సంగివలస కొత్తమ్మవారి ఆలయంలో శనివారం నుంచి చండీహోమం ప్రారంభించారు. టి.నగరపాలెంలో సరస్వతీపూజ చేశారు. చదువుల తల్లికి వందనం పీఎం పాలెం : చదువుల తల్లి సరస్వతీ దేవికి భక్తులు, విద్యార్థులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. బబ్బేలమ్మ అలయంలలో, పీఎం పాలెం ఆఖరు బస్టాపు సమీపంలోని శృంగేరి శంకర మఠం పీఠంలోని శారదాంబ అలయ మండపంలో బాలలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. బక్కన్నపాలెం పోలీస్ శిక్షణ కేంద్రంలో ... బక్కన్నపాలెం పోలీస్ శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో 16వ బెటాలియన్ కమాండెంట్ కె. సూర్యచంద్ణాధ్వర్యంలో సరస్వతీదేవి ఆరాధన అనంతరం సిబ్బంది పిల్లలకు పుస్తకాలు , పెన్నలు తదితర సామగ్రి అంద జేశారు. భూలోకమాత ఆలయప్రాంగణంలో రేవళ్లపాలెం(మధురవాడ): రేవళ్లపాలెంలోని శ్రీ భూలోకమాత ఆలయం లో శనివారం 300 మంది పిల్లలకు సామూహిక విద్యాభ్యాసాలు చేశారు. అర్చకులు రాజేటి గురునాథ శర్మ అమ్మవారికి బెవర బాపూజీ, శ్రామణి, వాం డ్రాసి సూరప్పారావు, శ్యామల, పెంటారావు, జానకీ దంపతులతో పూజలు చేయించారు. చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయంలో మహా కుంభాభిషేకం నిర్వహించారు. చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని సరస్వతీ దేవి ఆలయం వద్ద హెచ్ఎం రాజబాబు, పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు పి.దుర్గా ప్రసా ద్, పిళ్లా సూరిబాబు, పి.కృష్ణమూర్తి పాత్రుడు, ఉపాధ్యాయులు పూజలు నిర్వహించారు. -
విద్యామాతా.. వందనం