సాక్షి, న్యూఢిల్లీ: సాక్షి, న్యూఢిల్లీ: ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం ఇవ్వమని అడుగుతున్నాడా? అయితే అతనితో మీరు ఎలా వ్యవహరించాలనే విషయమై అవినీతి నిరోధక విభాగం అధికారులు సూచనలు, సలహాలు ఇస్తారు. ఆ ప్రకారంగా నడుచుకొని సదరు అవినీతి అధికారులను కటకటాల వెనక్కు తోయొచ్చు. అయితే ఈ విషయమై ముం దు మీరు అవినీతి నిరోధక విభాగాన్ని సంప్రదించా ల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనంతా సులభతరం చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌ను ప్రకటించింది. ఎన్నికలకు ముందు.. హస్తిన నుంచి అవినీతిని తరిమేస్తామని హామీ ఇచ్చిన కేజ్రీవాల్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు ‘యాంటి కరప్షన్ డ్రైవ్’ను ఆయన బుధరవారం ఢిల్లీలో ప్రారంభించారు.
అనంతరం ఢిల్లీ సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ‘011-27357169’ హెల్ప్ లైన్ నంబర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ఇది హెల్ప్‌లైన్ నంబర్ మాత్రమే. దీనికి ఫిర్యాదు చేసే అవకాశం లేదు. ఈ నంబర్‌కు ఫోన్ చేసి, స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి, ఆడియో లేదా వీడియో రికార్డింగుతో సాక్ష్యాన్ని అవినీతి నిరోధక విభాగానికి అప్పగించి లంచగొండి అధికారులను పట్టించవచ్చు. ఈ హెల్ప్‌లైన్ నంబరు ప్రతి ఢిల్లీవాసిని ఓ అవినీతి వ్యతిరేక ఉద్యమకారునిగా చేస్తుం ది. లంచగొండి అధికారులను భయపెట్టాలనేదే ఈ హెల్ప్‌లైన్ జారీ చేయడం వెనుకనున్న ప్రధాన ఉద్దేశం.
ఈ హెల్ప్‌లైన్ గురించి ఢిల్లీ ప్రభుత్వం హోర్డింగుల ద్వారా, రేడియో జింగిల్స్ ద్వారా ప్రచా రం చేస్తుంది. ఉద యం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తుంద’ని చెప్పారు. ‘అధికారులు ఎవరైనా లంచం అడిగితే నిరాకరించకండి. వారితో సెట్టింగ్ చేసుకొని మాకు తెలియచేయండి. మేం వారి భరతం పడతాం’ అని రామ్‌లీలామైదాన్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున ప్రకటించినట్లుగా మరో హామీ ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ హెల్ప్‌లైన్ నంబర్‌ను ముందుగా ప్రకటించినట్లుగా రెండు రోజులలోకాక పదిరోజుల తరువాత విడుదల చేశారు. విజిలెన్స్ విభాగంలో సమస్యల వల్ల ఈ హెల్ప్‌లైన్ నిర్వహించడానికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి సమయం పట్టిందని కేజ్రీవాల్ చెప్పా రు. అయితే ప్రస్తుతం తాము జారీ చేసిన నం బరు కఠినంగా ఉందని, సులభంగా ఉండే నాలుగంకెల నంబర్‌ను మరో నాలుగైదు రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
హెల్ప్‌లైన్ ఎలా పనిచేస్తుందో కూడా ఆయన వివరించారు. ‘011-27357169 నంబరుకు ఫోన్‌చేసినట్లయితే ఫోన్ చేసిన వ్యక్తి పేరు, వారు చెప్పే మాటలు ఢిల్లీ ప్రభుత్వ కాల్‌సెంటర్‌లో రికార్డు అవుతాయి. ఆ తరువాత ఫోన్ చేసిన వ్యక్తికి అవినీతి నిరోధక విభాగం అధికారి నుంచి పోన్ వస్తుంది. ఫోన్ చేసిన అధికారి స్టింగ్ ఆపరేషన్ ఎలా నిర్వహించాలనేది తెలియచేస్తారు. ఈ సలహా మేరకు ఫోన్‌చేసిన వ్యక్తి తనను లంచం అడిగిన అధికారి మాటలను ఫోన్‌లో రికార్డు చేసి దానిని అవినీతి నిరోధక విభాగానికి సమర్పిస్తే అవినీతి నిరోధక విభాగం వలపన్ని లంచం అడిగిన అధికారిని పట్టుకుంటుంద’ని ఆయన చెప్పారు. ఢిల్లీవాసి అందించే వీడియా లేదా ఆడియో టేపులు కోర్టులో సాక్ష్యంగా కూడా పనికి వస్తాయన్నారు. ఈ హెల్ప్‌లైన్‌ను సమర్థంగా నిర్వహించడం కోసం అవినీతి నిరోధక విభాగం తగినన్ని బృందాలను సిద్ధంగా ఉంచిందని చెప్పారు. అవసరమైతే ఢిల్లీ పోలీసుల సహాయం తీసుకోవడానికి లెప్టినెంట్ గవర్నర్‌తో మాట్లాడినట్లు ఆయన చెప్పారు.
హస్తిన నుంచి అవినీతిని తరిమేద్దాం!
Published Wed, Jan 8 2014 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement
Advertisement