వెప్పమ్ దర్శకురాలితో రాహుల్ | director anjana HERO Rahul Feel Good Romantic | Sakshi
Sakshi News home page

వెప్పమ్ దర్శకురాలితో రాహుల్

Published Sun, Nov 23 2014 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

వెప్పమ్ దర్శకురాలితో రాహుల్

వెప్పమ్ దర్శకురాలితో రాహుల్

 వెప్పమ్ చిత్రంతో మెగాఫోన్ పట్టిన మహిళా దర్శకురాలు అంజనా. దర్శకుడు గౌతమ్‌మీనన్ శిష్యురాలైన ఈమె దర్శకత్వం వహించిన తొలి చిత్రంలో నాని, నిత్యామీనన్, కార్తీక్‌కుమార్, బిందుమాధవి ముఖ్య పాత్రలను పోషించారు. ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకుని తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు అంజనా. ఈ చిత్రంలో రాహుల్ హీరోగా నటించనున్నారు. పల్లాండు వాళ్గ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంద ని ఆమె చెబుతున్నారు. కృతిక ఉదయనిధి స్టాలిన్ దర్శకత్వం వహించిన వణక్కం చెన్నై చిత్రం తరువాత రాహుల్ రవీంద్రన్ నటించనున్న చిత్రం ఇది. ఈ చిత్ర కథ చాలా కొత్తగా ఉందని తన పాత్ర కూడా వెరైటీగా ఉండడంతో వెంటనే నటించడానికి అంగీకరించినట్లు రాహుల్ తెలిపారు. ఎస్కాఅహ్మద్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే చెన్నైలో ప్రారంభమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement