పరిశ్రమలకు విద్యుత్ ‘కోత’ల ఎత్తివేత | Electrical 'cutting' s pull out for industries | Sakshi
Sakshi News home page

పరిశ్రమలకు విద్యుత్ ‘కోత’ల ఎత్తివేత

Published Thu, Aug 15 2013 3:15 AM | Last Updated on Wed, Sep 5 2018 3:37 PM

Electrical 'cutting' s pull out for industries

పరిశ్రమలకు విద్యుత్ కోతల నుంచి ఉపశమనం కలిగింది. విద్యుత్ కోతలు, ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తూ విద్యుత్ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీంతో పారిశ్రామికవేత్తలు ఊరట చెందారు. మరోవైపు జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి పెరిగింది. మరికొన్ని రోజుల్లో రాష్ట్రానికి సమృద్ధిగా విద్యుత్ లభించనుంది.
 
 సాక్షి, చెన్నై: రాష్ట్రంలో రోజుకు 12000 మెగావాట్ల మేరకు విద్యుత్ వినియోగమవుతోంది. ఉత్పత్తి ఇందుకు భిన్నంగా ఉంది. దీంతో విద్యుత్‌కోతలు విధించాల్సిన పరిస్థితి నెలకొంది. జూన్ నుంచి పవన్ విద్యుత్ ఉత్పత్తి మెరుగుపడింది. ప్రాజెక్టులు, కేంద్రం నుంచి వాటా సక్రమంగా అందడంతో జూన్ నుంచి కోతలు కొంత మేరకు తగ్గాయి. చెన్నై వంటి నగరాల్లో కోతల్ని పూర్తిగా ఎత్తేశారు. నెలకు ఓ పర్యాయం మరమ్మతుల పేరిట ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో అప్పుడప్పుడూ సరఫరా ఆపుతున్నారు.
 
 పెరిగిన ఉత్పత్తి
 కర్ణాటక, కేరళలో కురిసిన వర్షాల పుణ్యమా అని రాష్ట్రంలోని జలాశయాలకు నీటి రాక పెరిగింది. మెట్టూరు, భవానీసాగర్, ముల్లైపెరియార్ తదితర జలాశయూల్లో విద్యుత్ ఉత్పత్తి మెరుగుపడింది. వెయ్యి మెగావాట్ల వరకు జల విద్యుత్ అందుతోం ది. మరికొన్ని రోజుల్లో కల్పాకం మద్రాసు అణు విద్యుత్ కేంద్రం నుంచి 330 మెగావాట్లు, ఉత్తర చెన్నై థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 600 మెగావాట్లు, వళ్లియూరు నుంచి కొన్ని వందల మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి దక్కనుంది.
 
 పరిశ్రమలకు ఊరట
 రాష్ట్రంలోని పరిశ్రమలకు విద్యుత్ కోతలు, ఆంక్షలను 2008 నుంచి అమలు చేస్తున్నారు. సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుతున్నారు. అలాగే అడపాదడపా కోతలు విధిస్తున్నారు. మరోవైపు పవర్ హాలిడే అమలులో ఉంది. ఈ కోతల పుణ్యమా అని పరిశ్రమల యాజమాన్యాలకు అగచాట్లు తప్పడం లేదు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి ఆశాజనకంగా ఉండడంతో పరిశ్రమలకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 
 
 అడపాదడపా విధిస్తూ వచ్చిన కోతల్ని, పవర్ హాలిడేను ఎత్తివేస్తున్నట్లు విద్యుత్‌బోర్డు ప్రకటించింది. సాయంత్రం వేళల్లో అమల్లో ఉన్న 90 శాతం విద్యుత్ సరఫరా నిలుపుదలను 40 శాతానికి తగ్గిం చింది. ఈ విధానం సెప్టెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే అమల్లో ఉంటుందని విద్యు త్ బోర్డు స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయం పారిశ్రామికవర్గాలకు ఊరట కలిగించిందని చెప్పవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement