ఉద్యోగాల పేరుతో కుచ్చుటోపీ పెట్టిన ఘనుడు
బెంగళూరు పోలీసులకు రెఫర్ చేసి చేతులు దులుపుకున్న హిందూపురం పోలీసులు
యశవంతపురంలో కేసు నమోదు చేయని పోలీసులు
పోలీసులకు భారీగా డబ్బు ముట్టజెప్పిన నిందితుడు!
లబోదిబో మంటున్న నిరుద్యోగులు
బెంగళూరు : ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టి.. సుమారు రూ.30 కోట్లు దండుకున్న షేక్ అంజాద్ పర్వేజ్ ఆచూకీ ఇప్పటి వరకు చిక్కకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపురంలోని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. అక్కడి పోలీసులు కేసు దర్యాప్తును బెంగళూరులోని యశవంతపుర పోలీసులకు అప్పగించి చేతులు దుపులుకున్నారు. ఇక్కడి యశవంతపుర పోలీస్ స్టేషన్‌లో మాత్రం బుధవారం నాటికి కూడా కేసు నమోదు కాలేదు. ఇదిలా ఉండగా ఎలాగైనా కోట్లు సంపాదించాలని, నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టడానికి అంజాద్ పక్కా ప్లాన్ వేశాడు. బెంగళూరు చేరుకున్న అంజాద్ యాహు కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేసేవాడు. ఆ సమయంలో ఐటీ రంగంలో ఉద్యోగాలు సంపాదించడానికి వేల సంఖ్యలో నిరుద్యోగులు పోటీ పడుతున్నారని తెలుసుకున్నాడు. ఇక్కడి యశవంతపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేశ్వరం వెస్ట్‌లోని బ్రిగేడ్ గేట్ వే క్యాంపస్‌లో ఒక అంతస్తును కార్యాలయం కోసం అద్దెకు తీసుకొని రెడోలెంట్ సిస్టమ్స్ పేరిట కంపెనీ ఏర్పాటు చేశాడు. కంప్యూటర్లను సైతం అద్దె ప్రాతిపదికన తెచ్చి పెట్టాడు.
ప్రముఖ ఐటీ సంస్థల్లో ఉద్యోగం వచ్చిందని నమ్మించి నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి వారిని మోసం చేశాడు. పర్వేజ్‌పై బెంగళూరు సీసీబీ పోలీసులు దృష్టి సారించాలని బాధితులు అంటున్నారు. ప్రస్తుతం అంజాద్ బంధువుల సహకారంతో బెంగళూరులోనే రహస్య ప్రాంతంలో తలదాచుకున్నాడని బాధితులు ఆరోపిస్తుండగా, ఇప్పటికే దేశం విడిచి పారిపోయూడని కొందరు చెబుతున్నారు. కాగా, అంజాద్ వ్యవహారం పోలీసుల వద్దకు వెళ్లగానే అదుపులోకి తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, హిందూపురం పోలీసులు చేతులారా నిందితున్ని తప్పించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నారుు. నిందితుడు భారీ మొత్తం ఆఫర్ చేసినందునే పోలీసులు పెద్దగా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా మాట్లాడితే పోలీసుల నుంచి ఇక్కట్లు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోందని, ఇక ఈ వ్యవహారం అటకెక్కినట్లేనని ఓ బాధితుడు వాపోయూడు.
అంజాదూ ఎస్కేప్!
Published Thu, Nov 27 2014 2:16 AM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM
Advertisement
Advertisement