షోలాపూర్, న్యూస్‌లైన్: షోలాపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్క పార్టీ గెలుస్తోంది. గతంలో జరిగిన ఎన్నికల్లో మూడుసార్లు మాత్రమే జనతాపార్టీ విజయకేతనం ఎగురవేసింది. లింగారాజ్ వల్యాల్, ప్రతాప్ సింహమోహితే పాటిల్, సుభాష్ దేశ్‌ముఖ్‌లు బీజేపీ తరఫున పార్లమెంటు సభ్యులు కాగలిగారు. తెలుగువారైన లింగరాజు వల్వాల్ 1996లో బీజేపీ తరఫున ఈ నియోజకవర్గంలో బరిలోకి దిగి విజయకేతనం ఎగురవేశారు. అప్పట్లో ఆయనకు ప్రత్యర్థిగా కాం గ్రెస్ తరఫున పోటీచేసిన ధర్మన్న సాదులు ఓటమిపాలయ్యారు.
తదుపరి 2003లోని ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి ఆనందరావు దేవకతే (కాంగ్రెస్), ప్రతాప్ సింహ మోహితే పాటిల్ (బీజేపీ) మధ్య పోటీ హోరాహోరీరిగా కొనసాగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రతాప్ సింహ లక్షా పాతిక వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. షోలాపూర్ నియోజక వర్గం ఓటర్లు బీజేపీ అభ్యర్థులను మూడు సార్లు పార్లమెంటుకు పంపారు. లింగరాజ్ 1996లో గెలుపొందారు. 1998, 1999లలో సుశీల్‌కుమార్ శిందే గెలిచారు.
షోలాపూర్ బరి ఒక్కోసారి ఒక్కో పార్టీ విజయకేతనం
Published Sun, Mar 30 2014 11:21 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement