న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దఇవ్వాలని కోరుతూ అమెరికా నుంచి దేశ రాజధానిలోని పౌరులకు భారీగా ఫోన్లు, సందేశాలు రావటంపై విచారణకు ఆదేశించాలని కోరు తూ దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు స్పందిం చింది. దీనిపై ప్రతిస్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ జస్టిస్ ప్రదీప్ నంద్‌రాజోగ్ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు అనుకూలంగా అమెరికాకు చెందిన ఓ బృందం నిర్వహించిన పాత్రపై విచారణ జరపాలని న్యాయవాది ఎం.ఎల్.శర్మ పిటిషన్ దాఖలు చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి విదేశాల నుంచి నిధులు సమకూరుతున్నట్లు ఆయ న దాఖలు చేసిన పిటిషన్ ఇదే కోర్టులో పెండింగ్‌లో ఉంది. అమెరికాకు చెందిన ‘ఫోర్డ్ ఫౌండేషన్’ దీర్ఘకాలంగా కేజ్రీవాల్ ఆయన సహాయకులకు ఆర్థికంగా అండదండలు అందిస్తోందని పిటిషనర్ ఆరోపిం చారు. భారత్‌లో ఎన్నారైల పేరుతో వారు కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా గత నవంబర్, డిసెంబర్ నెలల్లో లాస్‌ఏంజిల్స్ నుంచి నగరానికి చెందిన ఓటర్లకు ఆరు లక్షలకు పైగా ఫోన్ కాల్స్, 300 ఎస్సెమ్మెస్‌లు వచ్చాయన్నారు. ఇందుకు రూ.10 కోట్లకుపైగా వెచ్చించారన్నారు. హోంశాఖ, ప్రభుత్వ అనుమతులు లేకుండా ఫోన్ కాల్స్ రావటం దేశ భద్రతకు ముప్పని వాదించారు. ఎన్నికల ప్రక్రియలో విదేశీ జోక్యాన్ని భారత రాజ్యాంగం అనుమతిస్తుందో లేదో చెప్పాలని కోరారు.
‘ఆప్’కు మద్దతుగా విదేశీ ఫోన్ కాల్స్
Published Fri, Jan 17 2014 11:32 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement