విదేశీ విద్యార్థినికి లైంగిక వేధింపులు | Foreign student Sexual harassed in hospital | Sakshi
Sakshi News home page

విదేశీ విద్యార్థినికి లైంగిక వేధింపులు

Published Thu, Nov 26 2015 8:21 AM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM

విదేశీ విద్యార్థినికి లైంగిక వేధింపులు - Sakshi

విదేశీ విద్యార్థినికి లైంగిక వేధింపులు

బెంగళూరు : ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో చికిత్స పొందుతున్న విదేశీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆసుపత్రి సిబ్బంది ఒకరిని ఎన్ఆర్ పోలీస్ స్టేషన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అమెరికా నుంచి 10 మంది విద్యార్థినిలు అధ్యయన పర్యటన నిమిత్తం మైసూరు వెళ్లారు. ఆ క్రమంలో వారిలో ఓ విద్యార్థిని తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను మైసూరులోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో చికిత్స నిమిత్తం చేరింది.

ఈ సమయంలో ఆసుపత్రి సిబ్బంది సుమీత్... ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి... లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో సదరు విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన ఎన్ఆర్ పోలీసులు... అనంతరం సుమిత్ని అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్ కి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement