sumith
-
తొలి రౌండ్లోనే సుమిత్ ఓటమి..!
నెల రోజుల తర్వాత పాల్గొన్న తొలి టోర్నీలో భారత టెన్నిస్ నంబర్‌వన్ సుమిత్ నగాల్‌కు నిరాశ ఎదురైంది. ఫ్రాన్స్‌లోని బోర్డెక్స్లో జరుగుతున్న బీఎన్పీ పరిబా ప్రైమ్రోజ్ ఏటీపీ–175 చాలెంజర్ టోర్నీలో సుమిత్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు.ప్రపంచ 93వ ర్యాంకర్ సుమిత్ 2–6, 2–6తో ప్రపంచ 130వ ర్యాంకర్ హరోల్డ్ మయోట్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం చవిచూశాడు. 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తన సరీ్వస్‌ను ఐదుసార్లు కోల్పోయాడు.ఇవి చదవండి: అర్జున్‌కు మిశ్రమ ఫలితాలు..! -
వికాస్ ‘కంచు’ పట్టు
అస్తానా (కజకిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ రెండో రోజు పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత్‌కు ఒక కాంస్య పతకం లభించింది. 72 కేజీల విభాగంలో వికాస్ కాంస్య పతక బౌట్లో 8–0తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో జెయిన్ తాన్ (చైనా)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన సుమిత్ (60 కేజీలు), రోహిత్ దహియా (82 కేజీలు), నరీందర్ చీమా (97 కేజీలు) కూడా కాంస్య పతక బౌట్లలో పోటీపడ్డారు. కానీ ఈ ముగ్గురికీ నిరాశే ఎదురైంది. కాంస్య పతక బౌట్లలో సుమిత్ 6–14తో మైతా కవానా (జపాన్) చేతిలో... రోహిత్ 1–5తో అలీరెజా (ఇరాన్) చేతిలో... నరీందర్ 1–4తో ఒల్జాస్ (కజకిస్తాన్) చేతిలో ఓటమి పాలయ్యారు. -
శభాష్ సుమీత్
కెరీర్లో తొలిసారిగా గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మెయిన్ ‘డ్రా’ మ్యాచ్ ఆడిన భారత యువ ప్లేయర్ సుమీత్ నాగల్ సంచలన ప్రదర్శన చేశాడు. 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత ఫెడరర్‌పై ఏకంగా తొలి సెట్ గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఫెడరర్ వెంటనే తేరుకొని ఆ తర్వాతి మూడు సెట్లను సాధించి విజయాన్ని అందుకున్నాడు. మొత్తానికి మ్యాచ్ ఓడినా... తన ఆటతో సుమీత్ మనసులు గెల్చుకున్నాడు. న్యూయార్క్: ఊహించిన ఫలితమే వచ్చినా... భారత యువ ఆటగాడు సుమీత్ నాగల్ పరాజయంలోనూ గౌరవాన్ని పొందాడు. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో క్వాలిఫయర్, ప్రపంచ 190వ ర్యాంకర్ సుమీత్ నాగల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ప్రపంచ మూడో ర్యాంకర్, 38 ఏళ్ల రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)తో భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సుమీత్ 6–4, 1–6, 2–6, 4–6తో ఓడిపోయాడు. ఆర్థర్ యాష్ స్టేడియం సెంటర్ కోర్టులో 2 గంటల 30 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమీత్ కళ్లు చెదిరే ఇన్సైడ్ అవుట్ ఫోర్‌హ్యాండ్ షాట్లతో అలరించాడు. మ్యాచ్ సాగుతున్నకొద్దీ ఫెడరర్ దూకుడు పెంచగా... అంతర్జాతీయ అనుభవం అంతగా లేకున్నా సుమీత్ ప్రతీ పాయింట్‌కు తన శక్తినంతా ధారపోసి ఆడాడు. ఫెడరర్‌కు సులువుగా పాయింట్లు ఇవ్వకుండా పోరాడాడు. మ్యాచ్ మొత్తంలో ఫెడరర్ 12 ఏస్‌లు సంధించి 7 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 57 అనవసర తప్పిదాలు చేసిన స్విస్ దిగ్గజం ఏడు బ్రేక్ పాయింట్లు సాధించాడు. మరోవైపు సుమీత్ మూడుసార్లు ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. 32 అనవసర తప్పిదాలు చేశాడు. ‘ఫెడరర్‌లాంటి దిగ్గజంతో నా కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ మ్యాచ్ ఆడినందుకు చాలా అద్భుతంగా అనిపిస్తోంది. ఫెడరర్ ఆటను చూశాక ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను’ అని 22 ఏళ్ల సుమీత్ వ్యాఖ్యానించాడు. ‘సుమీత్కు ఉజ్వల భవిష్యత్ ఉంది. ఈ మ్యాచ్‌లో అతను చాలా నిలకడగా ఆడాడు. అంతర్జాతీయస్థాయిలో సక్సెస్ సాధించాలంటే ఈ రకమైన ఆటతీరును కొనసాగించాల్సి ఉంటుంది’ అని ఫెడరర్ అన్నాడు. తొలి రౌండ్లో ఓడిన సుమీత్కు 35 ర్యాంకింగ్ పాయింట్లతోపాటు 58,000 డాలర్ల (రూ. 41 లక్షల 62 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఫెడరర్‌తోపాటు డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) కూడా రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. తొలి రౌండ్లో జొకోవిచ్ 6–4, 6–1, 6–4తో కార్బెలాస్ బేనా (స్పెయిన్)పై గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 6–1, 6–1తో షరపోవా (రష్యా)పై గెలిచింది. గత రెండు దశాబ్దాల్లో గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ మ్యాచ్‌లో ఒక సెట్ గెలిచిన నాలుగో భారతీయ ప్లేయర్ సుమీత్. గతంలో సోమ్‌దేవ్, యూకీ బాంబ్రీ, సాకేత్ ఈ ఘనత సాధించారు. ఫెడరర్‌పై మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లో సెట్ గెలిచిన ఏకైక భారతీయ ప్లేయర్ సుమీత్. గతంలో ఫెడరర్‌తో రోహన్ బోపన్న, సోమ్‌దేవ్ మ్యాచ్‌లు ఆడినా వరుస సెట్లలో ఓడిపోయారు. -
కాంస్య పతకం రేసులో రెజ్లర్ సుమీత్
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ సుమీత్ ఫ్రీస్టయిల్ 125 కేజీల విభాగంలో కాంస్య పతకం కోసం తలపడనున్నాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన సుమీత్ సెమీఫైనల్లో 0–5తో చైనా రెజ్లర్ జెవె డింగ్ చేతిలో ఓడిపోయాడు. అమర్‌వీర్ (కెనడా)–నికోలస్ ఎడ్వర్డ్ (అమెరికా) మధ్య మ్యాచ్ విజేతతో నేడు కాంస్యం కోసం జరిగే పోరులో సుమీత్ ఆడతాడు. భారత్‌కే చెందిన జితేందర్ (74 కేజీలు), పవన్ కుమార్ (86 కేజీలు) తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... సోన్బా తనాజీ (61 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. -
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 45% వాటా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 2018 డిసెంబరు నాటికి కంపెనీ వాటా 44–45 శాతానికి చేరుతుందని కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ అంచనా వేస్తోంది. జనవరి–జూన్ కాలంలో 39 శాతం వాటాతో నంబర్ వన్ స్థానంలో ఉన్నట్టు శాంసంగ్ మొబైల్ బిజినెస్ డైరెక్టర్ సుమిత్ వాలియా తెలిపారు. గెలాక్సీ ఏ7ను బుధవారం హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కంపెనీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 10–11 శాతం వాటాతో టాప్–5లో ఉంటాయని ఆయన చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 16 కొత్త స్మార్ట్ఫోన్లను భారత్‌లో అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలో నూతన ట్యాబ్లెట్ పీసీలను ప్రవేశపెడతామని వివరించారు. ‘జె’ సిరీస్‌లో 6 కోట్ల ఫోన్లు విక్రయించామన్నారు. ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 12 శాతం వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నట్లు సుమిత్ పేర్కొన్నారు. -
విదేశీ విద్యార్థినికి లైంగిక వేధింపులు
బెంగళూరు : ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతున్న విదేశీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆసుపత్రి సిబ్బంది ఒకరిని ఎన్ఆర్ పోలీస్ స్టేషన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అమెరికా నుంచి 10 మంది విద్యార్థినిలు అధ్యయన పర్యటన నిమిత్తం మైసూరు వెళ్లారు. ఆ క్రమంలో వారిలో ఓ విద్యార్థిని తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను మైసూరులోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో చికిత్స నిమిత్తం చేరింది. ఈ సమయంలో ఆసుపత్రి సిబ్బంది సుమీత్... ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి... లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో సదరు విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన ఎన్ఆర్ పోలీసులు... అనంతరం సుమిత్‌ని అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్ కి తరలించారు. -
ఓటు హక్కు మింగే ముందు కనీసం చెప్పండి
ఓటరు జాబితా నుంచి ఓటరు పేరును తొలగించే ముందు ఓటరుకు కారణాలను తప్పక తెలియజేయాలి. తొలగించే ముందు నోటీసు ఇవ్వడమే కాకుండా, అంతకు ముందు తన ఓటును రక్షించుకోవడానికి తన వాదం వినిపించే అవకాశాన్ని పూర్తిగా ఇవ్వాలి. ప్రతి ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలోంచి ఓటర్ల పేర్లు తొలగించారని గగ్గోలు పెట్టడం వింటూ ఉంటాం. ఒక ఓటరు తన ఓటు హక్కు ను హరించారంటూ ఆర్టీఐ దరఖాస్తు పెట్టుకున్నాడు. ఎం దుకు తొలగించారో తెలియజే యాలని కోరాడు. ఆ యువ కుడి పేరు సుమిత్. 21 సంవత్సరాల వయసు దాటింది. ఓటరుగా నమోదు చేసుకున్నాడు. ఓటర్ల జాబితాలోకి అతని పేరు ఎక్కింది కూడా. 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేశాడు. కాని 2015లో మళ్లీ జరిగిన అసెంబ్లీ ఎన్ని కల్లో ఓటర్ల జాబితాలో లేకపోవడంవల్ల తను ఓటు వేయలేకపోయాడు. తన ఓటరు చిరునామా మారలే దని, అదే ఇంట్లో ఉంటున్నానని, కాని తనకు తెలపకుం డా తన పేరును జాబితా నుంచి తొలగించడం వల్ల తాను ఓటు వేయలేకపోయాయని అతను వాదించాడు. తన పేరు తీసేసే ముందు తనకు తెలియజేయలేదని, ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టినా జవాబు ఇవ్వలేదని, మొ దటి అప్పీలులో కూడా జవాబు లేకపోవడం వల్ల కమి షన్ ముందుకు వచ్చానని వివరించాడు. మన రాజ్యాంగం 15వ భాగంలో ఎన్నికల వ్యవహా రం గురించి నియమాలున్నాయి. ఆర్టికల్ 325 ప్రకారం మతం, జాతి, కులం, ఆడామగ తేడా పైన ఓటర్ల జాబి తాలో చేర్చడంలో అనర్హత విధించడానికి వీల్లేదు. వయో జన ఓటు హక్కు ఆధారంగా ఎన్నికలు జరపాలని ఆర్టి కల్ 326 నిర్దేశిస్తున్నది. ఆర్టికల్ 19(1)(ఎ) కింద అభి ప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ కిందికి కూడా ఓటు హక్కు వస్త్తుంది. అంతర్జాతీయ ఒప్పందాలతోపాటు, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 62 ప్రకారం ఓటర్ల జాబి తాలో పేరున్న ఓటర్లందరూ ఓటు వేయడానికి అర్హులని నిర్దేశిస్తున్నది. ఓటరు అన్న నిర్వచనం కూడా జాబితాలో పేరున్న వారు అని ఉంది. సెక్షన్ 16లో అనర్హతలు వివ రించారు. ఓటు హక్కు రాజ్యాంగపరంగా పౌరుడికి ప్రసాదించిన కీలకమైన హక్కు అనీ, అయితే చట్టంలో ఈ హక్కును మరింత బలోపేతం చేశారనీ, ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ఇది చాలా మౌలికమైన ఆధారమని సుప్రీంకోర్టు 2013లో పి.యు.సి.ఎల్ వర్సెస్ యూని యన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టం చేసింది. నోటీసు పంపిన తరువాత కూడా చీఫ్ ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి ఎవరూ రాకపోవడం వల్ల వారి వాదం ఏమిటో ఎందుకు జవాబు ఇవ్వలేకపో యారో కమిషన్‌కు తెలిసే అవకాశం లేకుండా పోయిం ది. అభ్యర్థి అప్పీలుదారు వాదం ఒక్కటే కమిషన్ ముం దుకు వచ్చింది. చీఫ్ ఎన్నికల అధికారి కార్యాలయానికి రెండు బాధ్యతలు ఉన్నాయి. ఒకటి ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఓటరు జాబితా నుంచి ఓటరు పేరును తొల గించే ముందు ఓటరుకు కారణాలను తెలియజేయవల సిన బాధ్యత ఉంది. ఈ విషయాన్ని సెక్షన్ 22 ప్రజా ప్రాతినిధ్య చట్టం, రూల్ 21ఏ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలెక్టర్స్ రూల్స్ 1960 కింద చాలా స్పష్టంగా నిర్దేశించారు. తొల గించే ముందు నోటీసు ఇవ్వడమే కాకుండా, అంతకు ముందు తన ఓటును రక్షించుకోవడానికి తన వాదం వినిపించే అవకాశాన్ని పూర్తిగా ఇవ్వాలి. ఆ తరవాత కారణాలు వివరిస్తూ ఓటరు పేరును తొలగిస్తున్న సమా చారం నోటిఫై చేయవలసి ఉంటుంది. మీరే ఓటరు జాబితా చూడండి, మీ పేరు లేకపోతే ఫిర్యాదు చేయం డి, ఫలానా ఫారం నింపండి అని పత్రికలలో, టీవీలలో ప్రచారం చేసాం కనుక నోటీసు ఇచ్చినట్టే అని వాదించ డానికి వీల్లేదు. ఓటరుగా నమోదు కావడానికి ఈ వాదం పనికి వస్తుంది. కాని ఓటరుగా ఒకసారి లిస్ట్టులో చేరిన తరువాత, ఆ పేరును తొలగించడం అంటే హక్కును తొలగించడమే అవుతుంది కనుక తప్పనిసరిగా వ్యక్తి గతంగా నోటీసు ఇచ్చి తీరాలని, తరవాత వాదించే అవ కాశం ఇవ్వవలసి ఉంటుందని ప్రజాప్రాతినిధ్య చట్టం వివరిస్తున్నది. శ్రీమతి దార్ల రమాదేవి వర్సెస్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేసును 2009లో విన్న న్యాయమూర్తి ఎల్.నరసింహారెడ్డి ఇచ్చిన ఒక చారిత్రాత్మక తీర్పులో ఈ విషయాలు వివరించారు. ఓటర్లు కనబడకపోవడం వల్ల తాము ప్రత్యామ్నాయంగా నోటీసులు ఇచ్చామని కనుక నోటీసు ఇచ్చినట్టే అని చేసిన వాదనను న్యాయమూర్తి అంగీకరించలేదు. కొన్ని వందల పేర్లు తొలగించారని, తాము పేర్కొన్న అడ్రసు గల ఇండ్లలో నివసించడం లేదనీ ఆరోపించారని పిటిషనర్లు కోర్ట్టుకు తెలిపారు. నిజానికి తాము ఊళ్లోనే ఉన్నామని వారు వాదించారు. తగిన నోటీసులు ఇవ్వలేదన్న కారణంగా ఓటర్ల జాబితా నుంచి ఓటర్ల తొలగింపు చెల్లదని నరసింహారెడ్డి తీర్పు చెప్పారు. ఈ అంశంపైన ఇదే గణనీయమైన తీర్పు. సమాచార హక్కు కింద అడిగినపుడు ప్రతిస్పం దించడం మరో బాధ్యత. సెక్షన్ 4(1)(సి) కింద తమ చర్యలవల్ల నష్టపోతున్న వారికి, ఏవైనా హక్కులు కోల్పో తున్న వారికి ఎందుకు ఆ విధంగా చర్యలు తీసుకు న్నారో తెలియజేయవలసిన బాధ్యత ఉందని తమంత తామే ఈ కారణాలు వెల్లడించాలని సమాచార హక్కు చట్టం వివరిస్తున్నది. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఎందుకు కారణాలు వివరించలేదు, ఎందుకు నోటీసు ఇవ్వలేదు, తమ వాదా న్ని వినిపించుకునే అవకాశం ఎందుకు ఇవ్వలేదు. సమా చార హక్కు చట్టం కింద అడిగినా ఎందుకు ప్రతి స్పం దించలేదో వివరించాలని, ఎందుకు జరిమానా విధిం చకూడదో కారణాలు తెలపాలని కమిషన్ నోటీసు జారీ చేసింది. - మాడభూషి శ్రీధర్ (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com -
హాస్టల్ బాత్రూమ్లో విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ : హైదరాబాద్ మాదాపూర్‌లో ఓ ప్రయివేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సుమిత్ అనే విద్యార్థి హాస్టల్ గదిలోని బాత్రూమ్లో ఉరి వేసుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు. సుమిత్ స్వస్థలం రాజమండ్రి. కాగా విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కళాశాల యాజమాన్యం పోలీసులకు, మృతుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.