సాక్షి, చెన్నై : కేరళ రాష్ట్రం కసక్కోడుకు చెందిన ఉమానాథ్ స్వాతంత్య్ర సమరయోధుడు, వామపక్ష వాది. స్వాతంత్య్ర సంగ్రామంలో తొమ్మిదేళ్లు జైలు జీవితాన్ని సైతం ఆయన అనుభవించారు. రాష్ట్రంలోనే కాదు, జాతీ య స్థాయిలోని సీపీఎం నేతల్లో సీనియర్‌గా ఉన్న ఉమానాథ్ రెండు సార్లు ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా తన సేవలు అందించారు. తమిళనాడులో స్థిర పడ్డ ఆయనకు ముగ్గురు పిల్లలు. భార్య పాపమ్మ రెండేళ్ల క్రితం మరణించారు. ఈమె ఐద్వా నాయకురాలు, ఆమె కూడా ఓ మారు అ సెంబ్లీకి ఎన్నికయ్యారు. ఒక కుమార్తె లక్ష్మి కూడా ఇటీవల మృతి చెందారు. వామ పక్ష నేతగా, కార్మిక పక్షపాతిగా అందరి మదిలో ఉమానాథ్ చెరగని ముద్ర వేసుకున్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. సీపీఎం జాతీయ కమిటీ సభ్యుడిగా తన సేవలను అందిస్తూ వచ్చిన ఉమానాథ్ కొంతకాలంగా వయోభారం, అనారోగ్య స మస్యతో బాధ పడుతున్నారు.
రెండు సార్లు పుదుకోట్టై నుంచి పార్లమెంట్‌కు, మరో రెం డు సార్లు నాగపట్నం నుంచి అసెంబ్లీకి ఆయన ఎన్నికైనా సొంతం గా ఓ ఇల్లు అం టూ లేదు. కుమార్తెలను మాత్రం ప్రయోజకులను చేశారు. ఓ కుమార్తె నిర్మల రాణి న్యాయవాదిగా వ్యవహరిస్తుండగా, మరో కుమార్తె వాసుకీ తండ్రి బాటలో నడిచారు. రాష్ట్ర పార్టీలో, మహిళా విభాగం ఐద్వాలో వాసుకీ తన సేవలందిస్తున్నారు.
అనారోగ్యం: అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన కొంత కాలంగా తిరుచ్చి తిల్లై నగర్‌లోని కుమార్తె నిర్మల ఇంట్లో ఉం టూ వైద్య సేవలు పొందారు. పరిస్థితి విషమించడంతో గత వారం అక్కడే ఓ ఆస్పత్రిలో చేర్చారు. మూడు రోజుల క్రితం సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాష్ కారత్ తిరు చ్చి వచ్చి మరీ ఉమానాథ్‌ను పరామర్శించి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ చ్చిన కామ్రేడ్ ఉమానాథ్ బుధవారం ఉద యం తుది శ్వాస విడిచారు.
ఆయన మరణ సమాచారంతో సీపీఎం వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. సరిగ్గా 7.15 గంటలకు ఉ మానాథ్ మరణించినట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణన్ ప్రకటించారు. నివాళులు: ఉమానాథ్ భౌతిక కాయాన్ని కరూర్ బైపాస్ రోడ్డులోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఉంచారు. సందర్శనార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం ఇక్కడి నుంచి ఆయన పార్థివ దేహాన్ని వయ్యామరి శ్మశాన వాటికకు తరలించనున్నారు. అక్కడ పది గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఉమానాథ్ మృతి సీపీఎంకు తీరని లోటు అని రాజకీయ పక్షాల నాయకులు పేర్కొన్నారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ఎండీఎంకే నేత వైగో, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి టీ పాండియన్ తమ సానుభూతిని తెలియజేశారు.
కామ్రేడ్ ‘ఉమానాథ్’అస్తమయం.!
Published Wed, May 21 2014 11:17 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
Advertisement
Advertisement