పక్కా ఇళ్లపట్టాలు ఇప్పిస్తా.. | gives permanent homes rails | Sakshi
Sakshi News home page

పక్కా ఇళ్లపట్టాలు ఇప్పిస్తా..

Published Sat, Oct 11 2014 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

పక్కా ఇళ్లపట్టాలు ఇప్పిస్తా..

పక్కా ఇళ్లపట్టాలు ఇప్పిస్తా..

శివసేన సిట్టింగ్ ఎమ్మెల్యే రూపేష్ మాత్రే

భివండీ, న్యూస్‌లైన్: కొన్నేళ్లుగా ప్రభుత్వ స్థలాల్లో స్థిరనివాసాలు ఏర్పాటుచేసుకున్న తెలుగు, మరాఠి, ఉత్తరాది ప్రజలకు పక్కా ఇంటి నంబర్లు ఇప్పిస్తానని రూపేష్ మాత్రే హామీ ఇచ్చాడు. కామత్‌ఘర్,పేనాగావ్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాత్రే మాట్లాడుతూ తూర్పు భివండీ నియోజక వర్గ పరిధిలోని కామత్‌ఘర్, పేనాగావ్, గణేష్‌నగర్, భాగ్యనగర్, ఆశీర్వాద్‌నగర్, పద్మనగర్‌లో నివాసముంటున్న కార్మిక కుటుంబాలన్నింటికీ గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.

అఖిల పద్మశాలి సమాజ్ అధ్యక్షుడు కముటం శంకర్ మాట్లాడుతూ......తెలుగు ప్రజలకు అండగా ఉంటున్న మాత్రేను  గెలిపించుకోవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంద న్నారు. ఈ సభలో స్థానిక శివసేన కార్పొరేటర్లు తుషార్ చౌదరి, కమలాకర్ పాటిల్, మదన్ బువ్వా, పూనం పాటిల్, దిలీప్ గుల్వీ, అరుణ్ రాహుత్, సుందర్ నాయిక్‌తో భారీసంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement