మా హయాంలోనే వికలాంగులకు పెద్దపీట
Published Sun, Aug 25 2013 5:41 AM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM
వేలూరు, న్యూస్‌లైన్: అన్నాడీఎంకే ప్రభుత్వంలోనే వికలాంగులకు పెద్ద పీట వేశామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేసీ వీరమణి అన్నారు. వేలూరు కలె క్టరేట్‌లో ఎమ్మెల్యేల నిధి నుంచి వికలాంగులకు స్కూటర్‌లు, వికలాంగ పరికరాలు, చెవిటి వారికి మిషన్‌లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం వికలాంగులకు విద్య, ఉద్యోగాల్లో మూడు శాతం రిజర్వేషన్ కల్పించిందన్నారు. వివాహ నిధి, పెట్రోల్ వాహనాలను అందజేస్తున్నామన్నారు. వీటిని సద్విని యోగం చేసుకోవాలన్నారు.గత రెండు బడ్జెట్లలో ఒక్కో ఎమ్మెల్యే నిధి నుంచి రూ.1.30 లక్షలు కేటాయించామన్నారు. మొదటి విడతగా 250 మందికి రూ.28,54,160 విలువ చేసే పరికరాలను అందజేస్తున్నామన్నారు.
వికలాంగులను ఆదుకునేందుకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టామన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిం చామని చెప్పారు. అమ్మ ప్రవేశ పెడుతున్న పథకాలను చూసి ఇతర రాష్ర్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆశ్చర్య పోతున్నారన్నారు. అనంతరం వికలాంగులకు పెట్రోల్ వాహనాలు, ఇతర పరికరాలు, వివాహ సహాయ నిధి అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శంకర్, ఎమ్మెల్యేలు మహ్మద్‌జాన్, డాక్టర్ విజయ్, రవి, మేయర్ కార్తియాయిని, డెప్యూటీ మేయర్ ధర్మలింగం, వికలాంగుల సంక్షేమ శాఖాధికారి చార్లెస్ ప్రభాకరన్, జిల్లా రెవెన్యూ అధికారి బలరామన్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసన్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement