తిరువళ్లూరు: తిరువళ్లూరులోని వీరరాఘవస్వామి వారిని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. తిరువ ళ్లూరులోని వీరరాఘవస్వామి వారి ఆలయాన్ని గవర్నర్ దంపతులు దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం స్వామి వారిని దర్శించుకోవడానికి ఆయన సతీమణితో కలిసి వచ్చారు.
గవర్నర్ దంపతులకు ఆలయ నిర్వాహకులు గౌరవ ఏజెంట్ సంపత్, కలెక్టర్ సుందరవల్లి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ దంపతులు వీరరాఘవునితో పాటు కనకవల్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పుష్కరిణికి వెళ్లి పూజలు చేయించారు. ఆలయ అధికారులు గవర్నర్ దంపతులకు ప్రసాదాలను అందజేశారు. తిరువళ్లూరుకు గవర్నర్ రాక సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.