ప్రేమపేరుతో మోసం : ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌ | govt employee arrested in tamilnadu over fraud with love | Sakshi
Sakshi News home page

ప్రేమపేరుతో మోసం : ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌

Published Sat, Jan 28 2017 11:22 AM | Last Updated on Mon, Jul 29 2019 6:54 PM

ప్రేమపేరుతో మోసం : ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌ - Sakshi

ప్రేమపేరుతో మోసం : ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌

తమిళనాడు : ప్రేమ పేరుతో యువతిని గర్భవతి చేసి మోసగించిన ప్రభుత్వ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లా పెరమచూర్‌కు చెందిన కుమరేశన్‌ (30) అనే యువకుడు విద్యుత్‌ బోర్డు కార్యాలయంలో టెక్నీషియన్‌ సహాయకుడిగా పని చేస్తున్నాడు.

తొలసంపట్టికి చెందిన శశికళ (23) అనే యువతి కుమరేశన్‌ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం కాలేజీలో చదువుతున్న సమయంలో కుమరేశన్‌ బంధువు కుమార్తె ద్వారా ఆమె పరిచయమైంది. వివాహం చేసుకుంటానని నమ్మించి కుమరేశన్‌ శశికళను లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో శశికళకు రెండుసార్లు గర్భం అయ్యింది. ఆమెకు కుమరేశన్‌ అబార్షన్‌ చేయించాడు. ఇదే సమయంలో కుమరేశన్‌కు ఉద్యోగం పర్శినెంట్‌ కావడంతో ప్రియురాలితో మాట్లాడడం మానేశాడు. అతనికి మరో యువతితో వివాహ సంబంధాలు చూస్తున్నట్టు తెలుసుకున్న శశికళ స్థానిక మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కుమరేశన్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement