సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లో రైతుల సౌకర్యార్థం నర్సరీలను ప్రారంభించడానికి యోచిస్తున్నట్లు సహకార శాఖ మంత్రి హెచ్‌ఎస్ మహదేవ ప్రసాద్ తెలిపారు. నగరంలోని లాల్‌బాగ్‌లో ది నర్సరీ మెన్ కో-ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసిన మూడు రోజుల హరిత ఉత్సవాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సొసైటీ గత 50 సంవత్సరాలుగా మొక్కల పెంపకం, నిర్వహణ, హరిత వనాల స్థాపన తదితర పనులను చేపడుతూ వస్తోందని తెలిపారు. దీని వల్ల పట్టణ ప్రాంత రైతులకు అనుకూలంగా ఉంటుందన్నారు.
జిల్లా కేంద్రాల్లో ఈ సొసైటీ కేంద్రాలు లేనందున రైతులకు సరైన సదుపాయం లభించడం లేదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో సొసైటీ శాఖలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు వివరించారు. దీనిపై సొసైటీ ప్రతిపాదనలు సమర్పిస్తే, జిల్లా కేంద్రాల్లోని ఉద్యాన వనాల శాఖ భూములను కేటాయిస్తామని వెల్లడించారు. ఇప్పటికే మైసూరు, హాసన జిల్లాల్లో ఈ నర్సరీ శాఖలు పని చేస్తున్నాయని చెప్పారు. నగర శివార్లలోని యలహంక, దేవనహళ్లి, కెంగేరి తదితర చోట్ల కూడా ఈ శాఖలను ప్రారంభించి, రైతులకు అనుకూలంగా ఉండేలా చూస్తామన్నారు.
హరిత ఉత్సవ్
Published Sat, Oct 11 2014 1:53 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement