తనను వేరే కాపురం పెట్టమని వేధిస్తుండడంతో భరించలేకుండా అంగన్‌వాడీ మహిళను హత్య చేసినట్లు ప్రియుడు పోలీసుల కిచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. పుదుక్కోట్టై, కరంబకుడి సమీపానగల రఘునాధపురంకు చెందిన దురైసామి భార్య తులసియమ్మాళ్ (47) అంగన్‌వాడీ నిర్వాహకురాలు. ఈమె గత నెల 23వ తేదీన అదృశ్యమైంది. దీనిపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా ఉండగా కులప్పన్‌పట్టి తైలపు తోటలో ఆమె అస్థిపంజరం లభించింది.
విచారణలో ఇడయాత్తి వెల్లాలర్ వీధికి చెందిన ప్రైవేటు బస్ కండక్టర్ జయపాల్ (37) తులసియమ్మాళ్‌ను హత్య చేసినట్లు కనుగొన్నారు. జయపాల్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తనకు వివాహమై భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారని, అదే సమయంలో తులసియమ్మాల్‌తో నాలుగేళ్లుగా సంబంధం ఉందని పేర్కొన్నాడు. భార్యా బిడ్డలను విడిచిపెట్టి తనతో వేరు కాపురం పెట్టమని తరచూ వేధిస్తుండేదని, దీంతో విసిగిపోయిన తాను గత నెల 24వ తేదీన ఆమెను దేవకోట్టై సమీపానగల ఒక తైలపు తోటలో హత్య చేసినట్లు తెలిపాడు.
వేధించడంతో హత్య చేసా: ప్రియుడి వాంగ్మూలం
Published Thu, Jun 16 2016 1:59 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement