భారీ వర్షాలు ముంచెత్తుతుండడంతో ముంబైలో జనజీవనం స్తంభించింది. పుణె, నాసిక్‌లలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
భారీ వర్షాలు ముంచెత్తుతుండడంతో ముంబైలో జనజీవనం స్తంభించింది. పుణె, నాసిక్‌లలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో శాంతాక్రజ్‌లో 94.4 మి.మీ, కొలాబాలో 48.3 మి.మీల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వచ్చే 24 గంటల్లో కూడా ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. దాదర్, పరెల్, వొర్లిలో లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లు నిలవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ట్రాక్‌లపై నీరు నిలవడంతో సబర్బన్ రైళ్లు షెడ్యూల్ కంటే 15-20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.