సాక్షి, ముంబై: పుణే, పింప్రి-చించ్వాడ్ పట్టణాల్లో మద్యం విక్రయాలు ఏయేటికాయేడు పెరుగుతున్నాయి. గత ఏడాది నవంబర్ నెలతో పోలిస్తే ఈ నెలలో 6,53,571 లీటర్ల మద్యం అమ్ముడుపోయింది. ఒక వైపు నూతన సంవత్సరం సమీపిస్తుండడం, మరోవైపు చలి తీవ్రత ఎక్కువగా ఉండ డం కూడా మద్యం విక్రయాలు మరింత పెరగడానికి కారణమవుతోంది. ఈ నెలలో ఇప్పటిదాకా సుమారు 7.5 లక్షల లీటర్లకు పైగా మద్యం అమ్ముడుపోయినట్టు ఓ సర్వేలో వెల్లడైంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో బీర్ విక్రయాలు జోరుగా జరుగుతాయి.
అదేవిధంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లలో విదేశీ మద్యం, వైన్ అత్యధికంగా అమ్ముడుపోతాయి. ఇదిలాఉంచితే ఈ నెల 31తోపాటు జనవరి ఒకటో తేదీ అర్ధరాత్రి ఒంటి గంటదాకా మద్యం విక్రయించేందుకు ఆయా లిక్కర్ దుకాణాలకు అనుమతి లభించింది. అదేవిధంగా క్లబ్‌లు, పర్మిట్ రూంలను రాత్రంతా తెరచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఎక్సైజ్ శాఖ అధికారులు నవంబర్‌దాకా జరిపిన మెరుపుదాడుల్లో రూ.2.15 కోట్లకుపైగా విలువ చేసే నకిలీ మద్యం లభించింది. మొత్తం 982 మందిని ఈ సందర్భంగా అధికారులు అరెస్టు చేశారు.
పింప్రి-చించ్వాడ్ పట్టణాల్లో మద్యం విక్రయాల జోరు
Published Fri, Dec 27 2013 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
Advertisement
Advertisement