Sales of alcohol
-
భారీగా తగ్గిన మద్యం అమ్మకాలు
సాక్షి, అమరావతి: దశలవారీగా మద్య నిషేధం అమలు చేసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మద్యం అమ్మకాలు రోజురోజుకూ గణనీయంగా తగ్గుతున్నాయి. గత ఏడాది నవంబర్ నెలలో అమ్మకాలతో పోలిస్తే.. ఈ ఏడాది నవంబర్ మద్యం అమ్మకాల్లో 22.31 శాతం మేర తగ్గుదల నమోదైంది. గత ఏడాది నవంబర్‌లో బీర్ల అమ్మకాలతో పోలిస్తే.. ఈ ఏడాది నవంబర్‌లో సగానికి పైగా అమ్మకాలు తగ్గాయి. గతేడాది కంటే ఈ నవంబర్‌లో 54.30% తగ్గుదల నమోదైంది. షాపుల్ని తగ్గించి.. వేళల్ని నియంత్రించటమే కారణం గతంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను ప్రభుత్వం 3,500కు తగ్గించింది. విక్రయ వేళల్ని ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు పరిమితం చేశారు. కొత్త మద్యం విధానంలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అమ్మకాలు తగ్గాయని, ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం లేకపోవడం, వేళల్ని కచ్చితంగా పాటించడంతో మద్యం విక్రయాలు క్రమక్రమంగా నియంత్రణలోకి వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. గతంలో పర్మిట్ రూములతో కొన్నిచోట్ల, పర్మిట్లు లేకుండా మరికొన్ని చోట్ల మద్యం సేవించేవారు. ఇప్పుడు పర్మిట్ రూములను రద్దు చేయడంతో మద్యం షాపులు కేవలం అమ్మకానికి మాత్రమే పరిమితమవుతున్నాయి. గ్రామాల్లోని బెల్ట్ షాపులను ఎక్సైజ్ అధికారులు, పోలీసులు తొలగించడంతో అక్కడా మద్యం వినియోగం భారీగా తగ్గింది. -
రిజిస్ట్రేషన్ల ఆదాయం ఢమాల్!
నోట్ల రద్దు, ఇతర కారణాలతో తగ్గిన రాబడి - అవినీతి, అధికారుల నిర్లక్ష్యమూ కారణమే - పెరిగిన మద్యం విక్రయాల ఆదాయం - ఫరవాలేదనిపించిన అమ్మకపు పన్ను - ముగిసిన 2016–17 ఆర్థిక సంవత్సరం - కేంద్ర పన్నుల్లోంచి వచ్చే రాష్ట్రవాటాపైనే సర్కారు ఆశలు! సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మూడో ఆర్థిక సంవత్సరం ఈ మార్చి 31తో ముగిసిపోయింది. 2016–17లో రిజిస్ట్రేషన్ల ద్వారా ఊహించినంత ఆదాయం రాకపోవడం సర్కారు అంచనాలను దెబ్బ తీసింది. నోట్ల రద్దు ప్రభావంతో డిసెంబర్ నుంచి వరుసగా స్టాంపులు–రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో మద్యం అమ్మకాలతో వచ్చే రాబడి పెరగడం రాష్ట్ర ఖజానాకు కొంత ఊరటనిచ్చింది. మరోసారి లక్ష్యానికి దూరంగా.. వార్షికాదాయ లక్ష్యాన్ని చేరుకోవడంలో స్టాంపు లు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈసారి కూడా చతికిల పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటున్న దశలో కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం కోలుకోలేని దెబ్బతీసింది. వాస్తవానికి 2016–17లో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖకు వార్షికాదాయ లక్ష్యాన్ని (స్టాంపుడ్యూటీ మాత్రమే) రూ.4,291.99 కోట్లుగా నిర్దేశించింది. కానీ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.3,549 కోట్లు మాత్రమే సమకూరింది. గత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి నవంబర్ వరకు ప్రతి నెలా రూ.330 కోట్ల వరకు ఆదాయం రాగా.. డిసెంబర్లో రూ.243 కోట్లు, జనవరిలో రూ.222 కోట్లకు తగ్గిపో యింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. మొత్తంగా లక్ష్యంలో 82.7 శాతం ఆదాయం లభించినా.. అది గతేడాది (83.7 శాతం) కన్నా తక్కువే. అవినీతి, నిర్లక్ష్యమే కారణం! మూడేళ్లుగా క్షేత్రస్థాయిలో తనిఖీలు సక్రమం గా చేయకపోవడంతో కిందిస్థాయి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని, మార్కెట్ విలువ కంటే తక్కువగా లెక్కించి రిజిస్ట్రేషన్ల ఆదాయానికి గండికొట్టారని కాగ్ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఏడేళ్లుగా సబ్ రిజిస్ట్రార్ల బదిలీలు చేయకపోవడం, కొందరు సబ్ రిజిస్ట్రార్లు ఐదేళ్లకు పైగా ఒకే స్థానంలో పనిచేస్తుండడం కూడా అవినీతికి ఆస్కారమి చ్చినట్టయిందనే ఆరోపణలున్నాయి. మరో వైపు ఈ శాఖకు మూడేళ్లుగా పూర్తిస్థాయి కమిషనర్ కూడా లేరు. ఇన్చార్జిగా ఉన్న అధికారికే మరో రెండు విభాగాల బాధ్యత లను కూడా అప్పగించడం కూడా ఇబ్బం దికరంగా మారిందని చెబుతున్నారు. ఇక 10 జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. తగ్గిన పన్నేతర ఆదాయం రాష్ట్రంలో పన్నేతర రాబడి గణనీయంగా తగి ్గపోయింది. ఫీజులు, జరిమానాలు, డివిడెండ్లు, లాభాలు, అటవీ ఉత్పత్తులు, ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయం ఈ పద్దులో ఉంటుంది. 2015–16లో పన్నేతర రాబడి ద్వారా రూ.17,542 కోట్లు సమకూరుతాయని అంచనా వేయగా.. జనవరి నాటికి రూ.2,728 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఆదుకున్న మద్యం విక్రయాలు రాష్ట్ర ఎక్సైజ్ డ్యూటీ ద్వారా వచ్చిన ఆదాయం చివరి నాలుగు నెలల్లో భారీగా పెరిగింది. మద్యం ఉత్పత్తులపై పన్ను ద్వారా రూ.4,543 కోట్లు రాబట్టాలని అంచనా వేయగా.. జనవరి నాటికే ఆ మేర ఆదాయం సమకూరడం గమనార్హం. ఎక్సైజ్ డ్యూటీ ద్వారా అక్టోబర్‌లో రూ.291 కోట్లు, నవంబర్‌లో రూ.201 కోట్లురాగా.. డిసెంబర్లో ఏకంగా రూ.564 కోట్లు సమకూరాయి. నాలుగు నెలలకోసారి మద్యం కంపెనీలు చెల్లించే వాటా జమకావటంతో జనవరిలో రూ.812 కోట్లు వచ్చాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లోనూ రాబడి పెరిగింది. ఇక అమ్మకపు పన్ను (సేల్స్ ట్యాక్స్) ద్వారా వచ్చిన ఆదాయం ఏడాది పొడవునా నిలకడగా కొనసాగింది. -
వైన్ షాపులో కల్తీ మద్యం పట్టివేత
98 క్వార్టర్, రెండు ఫుల్ బాటిళ్లు స్వాధీనం శాంపిల్‌ను ల్యాబ్‌కు పంపిన అధికారులు ములుగు : నీళ్లు కలిపి అక్రమంగా మద్యం అమ్మకాలు చేపడుతున్న వైన్‌షాపుపై బుధవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీమాన్ వైన్‌షాపులో కొద్ది రోజులుగా మద్యంలో నీళ్లు కలిపి కల్తీ చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులకు కొంతమంది ఫిర్యాదు చేశారు. స్పందించిన జిల్లా డిప్యూటీ కమిషనర్ నర్సారెడ్డి తన బృందంతో కలిసి వైన్‌షాపులో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నీళ్లు కలిపిన మద్యాన్ని అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో ఆఫీసర్ చాయిస్, ఇంపీరియల్ బ్లూ, ఎంసీ డైట్, రాయల్ స్టాగ్ 98 క్వార్టర్ బాటిళ్లు, రెండు ఫుల్‌బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.12 వేల వరకు ఉంటుందనితెలిపారు. బాటిళ్ల నుంచి శాంపిళ్లను సేకరించి నిర్ధారణ కోసం ప్రయోగశాలకు పంపించనున్నట్లు తెలిపారు. ఫలితాల ఆధారంగా సదరు షాపు యజమానిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కల్తీ మద్యం అమ్ముతున్న 20 షాపులపై ఇప్పటి వరకు కేసులు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ నర్సారెడ్డి తెలిపారు. వారివెంట వరంగల్ ఎక్సైజ్ సీఐ రామకృష్ణ, స్థానిక ఎక్సైజ్ ఎస్సై మాన్సింగ్, సిబ్బంది ఉన్నారు. -
ఫుల్లుగా తాగారు
డిసెంబర్ 31న జిల్లాలో రూ.7 కోట్ల మేర విక్రయాలు నగరంలో అత్యధికంగా రూ.3 కోట్ల వ్యాపారం నూతన సంవత్సరానికి ఘనస్వాగతం పలికిన మందుబాబులు విజయవాడ : డిసెంబర్ 31వ తేదీన జిల్లాలోని మందుబాబులు రికార్డు స్థాయి లో తాగేశారు. ఎన్నడూ లేని విధంగా నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఒక్కరోజులోనే రూ.7కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ మొత్తంలో రూ.3కోట్ల విలువైన మద్యం నగరంలోనే విక్రయించారు. సాధారణంగా మూడు రోజుల్లో విక్రయించే మద్యం డిసెంబర్ 31న ఒక్క రోజులోనే అయిపోయింది. దీంతో ఎక్సైజ్ శాఖకు ఆదాయం భారీగా పెరగటంతోపాటు ప్రతి మద్యం షాపులోనూ అధిక ధరలకు విక్రయించడంతో వ్యాపారులకు కూడా లాభాలు వచ్చాయి. జిల్లాలో 20 ఎక్సైజ్ సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో 301 మద్యం షాపులు, 156 బార్లు ఉన్నాయి. గత ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి కొత్త మద్యం లెసైన్స్‌ల కాలపరిమితి ప్రారంభమైంది. నెలకు సగటున రూ.100 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. వ్యాపారులు, అధికారులకు మధ్య కుదిరిన ఒప్పందం మేరకు క్వార్టర్ సీసాకు ఐదు రూపాయలు చొప్పున అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని మద్యం షాపులు, బార్లలో రూ.3 కోట్లు, వారాంతాల్లో రూ.4 కోట్ల వరకు విక్రయాలు జరుగుతుంటాయి. అయితే, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ డిసెంబర్ 31న జిల్లా వ్యాప్తంగా భారీగా పార్టీలు ఏర్పాటుచేశారు. అక్కడ మద్యం తాగడం సాధారణ విషయంగా మారింది. స్నేహితులు కలిసి పెద్దఎత్తున మద్యం కొనుగోలు చేశారు. దీంతో ఒక్క రోజులోనే రూ.7కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతివ్వడం కూడా వ్యాపారులకు కలిసివచ్చింది. ముందుగానే నిల్వలు నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని మద్యం వ్యాపారులు గత నెల 27వ తేదీ నుంచే సరుకు కొనుగోలు చేసి నిల్వ ఉంచారు. మరోవైపు 31వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా మద్యం డిపోల నుంచి వ్యాపారులు భారీగా కొనుగోలుచేశారు. విజయవాడ ఎక్సైజ్ డివిజన్లో అత్యధికంగా రూ.5.2 కోట్ల విలువైన 12,986 కేసుల మద్యం విక్రయించారు. మచిలీపట్నం డివిజన్లో సుమారు రూ.2 కోట్ల విలువైన 5వేల కేసుల మద్యం విక్రయాలు జరిగాయి. ఇవి అధికారికంగా డిసెంబర్ 27 నుంచి 31 మధ్య జరిగిన విక్రయాలు మాత్రమే. అప్పటికే షాపుల్లో ఉన్న స్టాక్ కూడా సుమారు రూ.50 లక్షల వరకు విక్రయించినట్లు సమాచారం. నగరంలో రూ.3కోట్లకు పైగా వ్యాపారం విజయవాడ ఎక్సైజ్ డివిజన్లో వ్యాపారులు కొనుగోలు చేసిన మద్యంలో 70 శాతం నగరంలో విక్రయించారు. జిల్లావ్యాప్తంగా జరిగిన విక్రయాల్లో కూడా 40 శాతం నగరంలోనే అమ్మినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2013 డిసెంబర్ నెలలో రూ.92 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. 2014లో మాత్రం రూ.102 కోట్ల మద్యం విక్రయించారు. మద్యం విక్రయాలు గతేడాది కన్నా పెరిగాయని ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ జి.జోసఫ్ ‘సాక్షి’కి తెలిపారు. జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని చెప్పారు. -
రూ. 2 కోట్ల విలువైన మద్యం విక్రయాలు
వేడుక చేసుకున్నారు కుత్బుల్లాపూర్: శివారు ప్రాంతంలో ఒకే రోజు రూ. 2 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. మొత్తం ఎక్సైజ్ పోలీసుల నుంచి ఆరుగురు నిర్వాహకులు అనుమతులు తీసుకోగా బార్లు, వైన్‌షాపుల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. డిసెంబరు 31 రాత్రి సంబరాల నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయగా ఫంక్షన్ హాళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాలు, బార్లలో యువ త వేడుక చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు చేపట్టడంతో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు చెప్పారు. 88 మందిపై కేసు నమోదు.. ఒక వైపు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతుండగా మరో వైపు తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సంబరాలకు అడ్డుచెప్పని ట్రాఫిక్ పోలీసులు ఆ తర్వాత బాలానగర్‌లో సీఐ రాములు, సూరారంలో జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ వేణుగోపాల స్వామి, పేట్ బషీరాబాద్‌లో అల్వాల్ ట్రాఫిక్ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో ముమ్మరంగా ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలు నిర్వహించారు. మూ డు ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 88 మందిపై కేసులు నమోదు చేశారు. రికార్డు స్థాయిలో .. మూడు రహదారులకు అనుసంధానంగా ఉన్న బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ పరిధిలో 2014 ఏడాది మొత్తంమీద డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా పట్టుబడ్డ వారిపై 2808 కేసులు నమోదు కాగా వీరిలో 854 మందిని జైలుకు పంపిన ఘనత వీరికే దక్కింది. రాష్ట్రంలో అత్యధికంగా మద్యం తాగి వాహనాలు నడిపిన వారిని జైలుకు పంపిన ఏసీపీ జోన్ బాలానగర్ కావడం విశేషం. మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండాలని, ఈ విషయంలో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ట్రాఫిక్ ఏసీపీ శ్యామ్‌సుందర్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. -
పింప్రి-చించ్వాడ్ పట్టణాల్లో మద్యం విక్రయాల జోరు
సాక్షి, ముంబై: పుణే, పింప్రి-చించ్వాడ్ పట్టణాల్లో మద్యం విక్రయాలు ఏయేటికాయేడు పెరుగుతున్నాయి. గత ఏడాది నవంబర్ నెలతో పోలిస్తే ఈ నెలలో 6,53,571 లీటర్ల మద్యం అమ్ముడుపోయింది. ఒక వైపు నూతన సంవత్సరం సమీపిస్తుండడం, మరోవైపు చలి తీవ్రత ఎక్కువగా ఉండ డం కూడా మద్యం విక్రయాలు మరింత పెరగడానికి కారణమవుతోంది. ఈ నెలలో ఇప్పటిదాకా సుమారు 7.5 లక్షల లీటర్లకు పైగా మద్యం అమ్ముడుపోయినట్టు ఓ సర్వేలో వెల్లడైంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో బీర్ విక్రయాలు జోరుగా జరుగుతాయి. అదేవిధంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో విదేశీ మద్యం, వైన్ అత్యధికంగా అమ్ముడుపోతాయి. ఇదిలాఉంచితే ఈ నెల 31తోపాటు జనవరి ఒకటో తేదీ అర్ధరాత్రి ఒంటి గంటదాకా మద్యం విక్రయించేందుకు ఆయా లిక్కర్ దుకాణాలకు అనుమతి లభించింది. అదేవిధంగా క్లబ్‌లు, పర్మిట్ రూంలను రాత్రంతా తెరచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఎక్సైజ్ శాఖ అధికారులు నవంబర్‌దాకా జరిపిన మెరుపుదాడుల్లో రూ.2.15 కోట్లకుపైగా విలువ చేసే నకిలీ మద్యం లభించింది. మొత్తం 982 మందిని ఈ సందర్భంగా అధికారులు అరెస్టు చేశారు.