98 క్వార్టర్, రెండు ఫుల్ బాటిళ్లు స్వాధీనం
శాంపిల్‌ను ల్యాబ్‌కు పంపిన అధికారులు
ములుగు : నీళ్లు కలిపి అక్రమంగా మద్యం అమ్మకాలు చేపడుతున్న వైన్‌షాపుపై బుధవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీమాన్ వైన్‌షాపులో కొద్ది రోజులుగా మద్యంలో నీళ్లు కలిపి కల్తీ చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులకు కొంతమంది ఫిర్యాదు చేశారు. స్పందించిన జిల్లా డిప్యూటీ కమిషనర్ నర్సారెడ్డి తన బృందంతో కలిసి వైన్‌షాపులో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నీళ్లు కలిపిన మద్యాన్ని అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో ఆఫీసర్ చాయిస్, ఇంపీరియల్ బ్లూ, ఎంసీ డైట్, రాయల్ స్టాగ్ 98 క్వార్టర్ బాటిళ్లు, రెండు ఫుల్‌బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.12 వేల వరకు ఉంటుందనితెలిపారు.
బాటిళ్ల నుంచి శాంపిళ్లను సేకరించి నిర్ధారణ కోసం ప్రయోగశాలకు పంపించనున్నట్లు తెలిపారు. ఫలితాల ఆధారంగా సదరు షాపు యజమానిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కల్తీ మద్యం అమ్ముతున్న 20 షాపులపై ఇప్పటి వరకు కేసులు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ నర్సారెడ్డి తెలిపారు. వారివెంట వరంగల్ ఎక్సైజ్ సీఐ రామకృష్ణ, స్థానిక ఎక్సైజ్ ఎస్సై మాన్‌సింగ్, సిబ్బంది ఉన్నారు.
వైన్ షాపులో కల్తీ మద్యం పట్టివేత
Published Thu, Jan 8 2015 1:09 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Advertisement