
సాక్షి, తిరుమల: తెలుగు హీరో నాని, తమిళ హీరో జయం రవి ఆదివారం తిరుమల శ్రీవారిని వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో సతీమణి అంజన, ఇతర కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని నాని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల నానిని చూసి, కరచాలనం చేసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు.