నట్టితో నటిస్తుందా? | i am acting with nutty says Samantha | Sakshi
Sakshi News home page

నట్టితో నటిస్తుందా?

Published Tue, May 26 2015 3:55 AM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM

నట్టితో నటిస్తుందా? - Sakshi

నట్టితో నటిస్తుందా?

ప్రస్తుతం కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన నటి సమంత. ప్రముఖ హీరోలందరితోనూ నటించేస్తున్న ఈ బ్యూటీకి అవకాశాలు వద్దంటే వచ్చి పడుతున్నాయి. విక్రమ్, ధనుష్, సూర్యతో నటిస్తున్న ఈ చెన్నై చిన్నది త్వరలో విజయ్, ధనుష్, విక్రమ్‌తో మరో సారి నటించడాకి సమాయత్తమవుతున్నారు. కాగా తాజాగా మరో చిత్రం ఆమె కాల్షీట్ కోసం ఆశిస్తోందన్నది తాజా సమాచారం. ఇంతకుముందు చతురంగవేట్ట, కధంకధం వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన నట్టి అనే నటరాజ్ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు.
 
 ఈయన ప్రముఖ ఛాయాగ్రహకుడన్న విషం గమనార్హం. పలు బాలీవుడ్ చిత్రాలకు ఛాయాగ్రహణ నెరపిన ఈయన ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న పులి చిత్రానికి కెమెరామన్‌గా పనిచేస్తున్నారు. ఇలా రెండు పడవలపై స్వారీ చేస్తున్న నట్టి తను హీరోగా నటించే చిత్రం కోసం పలు కథలు వింటూ వస్తున్నారట. అలా విన్న కథల్లో నవ దర్శకుడు రామ్‌చెల్లప్ప చెప్పిన కథ నచ్చడంతో ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రామ్‌చెల్లప్ప దర్శకుడు పాండిరాజ్ శిష్యుడన్నది గమనార్హం.
 
 పులి చిత్రం పూర్తి కాగానే ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీన్ని ఈరోస్ సంస్థ నిర్మించనున్నట్టు సమాచారం. కాగా ఇందులో నట్టి సరసన నటించడానికి నటి సమంతతో పాటు మరి కొంత మంది నటీమణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అదేవిధంగా ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందట. అయితే ఇంత బిజీ షెడ్యూల్‌లో సమంత నట్టితో నటించడానికి అంగీకరిస్తుందా? అన్నదే ప్రశ్న.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement