పెళ్లయ్యిందంటూ గుసగుసలు | It's confirmed, Nayanthara is dating Vignesh Sivan | Sakshi
Sakshi News home page

పెళ్లయ్యిందంటూ గుసగుసలు

Published Thu, Oct 22 2015 3:21 AM | Last Updated on Sun, Sep 3 2017 11:18 AM

పెళ్లయ్యిందంటూ గుసగుసలు

పెళ్లయ్యిందంటూ గుసగుసలు

కాయలున్న చెట్టుకే దెబ్బలన్న సామెతగా నటి నయనతార గురించి ఏదో ఒక ప్రచారం తరచూ జరుగుతూనే ఉంది.రెండు సార్లు ప్రేమలో ఓడిపోయిన నయనతార సంచలనాలకు కేంద్రబిందువు కాదని ఎవరూ అనజాలరు. మొదట్లో శింబుతో ప్రేమ కోలీవుడ్‌లో చాలానే కలకలం పుట్టించింది. ఆ ప్రేమ కథ కంచికి చేరడంతో కొన్నాళ్లు సెలైంట్‌గా ఉన్న నయనతార మళ్లీ ప్రభుదేవాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. వారి మధ్య ప్రేమ పెళ్లి పీటలెక్కడం ఖాయం అనుకున్నారు.
 
  అయితే అదీ తొలి ప్రేమ దారే పట్టింది. ఆ తరువాత ప్రేమా లేదు దోమ లేదు ఆ రెండింటికి తన జీవితంలోనే తావు లేదు అంటూ విరక్తిని వ్యక్తం చేసిన ఈ మలయాళీ భామ మరోసారిప్పుడు ప్రేమలో పడ్డట్లు కోలీవుడ్ కోడై కూస్తోంది. ఆమె తాజాగా నటించిన నానుమ్ రౌడీదాన్ చిత్ర దర్శకుడు విఘ్నేశ్‌శివతో ప్రేమలో పడ్డట్టు ప్రచారం మొదలై చాలా నెలలే అయ్యింది. దర్శకుడికి నయనతార ఖరీదైన కారును బహుమతిగా కొనిచ్చినట్లు, చెన్నైలో ఒక అందమైన ఇంటిని కొనిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
 
 తాజాగా దర్శకుడు విఘ్నేశ్‌శివను నయనతార రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అదంతా వదంతేనంటూ దర్శకుడు కొట్టి పారేశారు. అలాంటిది సమీపకాలంలో నానుమ్ రౌడీదాన్ చిత్ర విలేకరుల సమావేశంలో కరెక్ట్ చేయడంలో విఘ్నేశ్‌శివ సిద్ధహస్తుడని ఆ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన నటుడు పార్తీపన్ వ్యాఖ్యానించారు.
 
 దీంతో వేదిక మీద ఉన్న చిత్ర యూనిట్‌తో పాటు వేదిక ముందు ఉన్నవాళ్లు గొల్లున నవ్వడం గమనార్హం. కాగా నయనతారతో ప్రేమ, రహస్య వివాహం గురించి దర్శకుడు విఘ్నేశ్‌శివను ప్రశ్నించగా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం అనవసరం అనే భావాన్ని వ్యక్తం చేయడం వారి మధ్య ఏదో ఉందనే సందేహానికి ఆస్కారం కలగక మానదంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement