అమ్‌స్టర్‌డ్యామ్‌కు జెట్‌ ఎయిర్‌వేస్‌ సర్వీసులు | Jet Airways Services From Bangalore to Amsterdam | Sakshi
Sakshi News home page

బెంగళూరు నుంచి అమ్‌స్టర్‌డ్యామ్‌కు జెట్‌ ఎయిర్‌వేస్‌ సర్వీసులు

Published Thu, Oct 5 2017 1:51 AM | Last Updated on Thu, Oct 5 2017 1:51 AM

Jet Airways Services From Bangalore to Amsterdam

సాక్షి, బెంగళూరు : జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ బెంగళూరు నుంచి నెదర్లాండ్స్‌ రాజధాని అమ్‌స్టర్‌డ్యామ్‌కు ప్రతి రోజు నాన్‌ స్టాప్‌ విమాన సర్వీసులను అందించనుంది. ఈ నెల 29 నుంచి ఈ సేవలు అందుబాటు లోకి వస్తాయి. బెంగళూరులో బుధవారం మీడియా సమావేశంలో సంస్థ సీఈవో వినయ్‌ దుబే వివరాలు వెల్లడించారు.

బెంగళూరు నుంచి ప్రతిరోజూ తెల్లవారుజామున 02:25 గంటలకు విమానం బయలుదేరుతుంది. అమ్‌స్టర్‌డ్యామ్‌కు ప్రయాణ సమయం దాదాపు 9గంటలు పడుతుందన్నారు. అక్కడి నుంచి బెంగళూ రుకు ఉదయం 10:50 గంటలకు విమానం  బయలు దేరుతుంది. ప్రారంభ ఆఫర్‌గా ఎకానమీ క్లాస్‌ టికెట్‌ ధర రూ. 39,999గా నిర్ణయించామని ఆయన చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement